ఆర్బీఎల్ బ్యాంక్ స్కాం : బావ, బామ్మర్దులు కలిసి కోట్లకు ముంచారు.. ఆర్బీఎల్ బ్యాంక్ నకిలీ సేవా కేంద్రాల పేరుతో

By AN TeluguFirst Published Nov 18, 2021, 12:08 PM IST
Highlights

ఆర్ బిఎల్ బ్యాంక్ అధికారి భాటియా, తన బామ్మర్ధి  కాల్ సెంటర్ పేరుతో చేసే మోసాలను గుర్తించాడు.తప్పు అని చెప్పాల్సింది పోయి..  బ్యాంకులోని లక్షలమంది క్రెడిట్ దారుల సమాచారంను ఇస్తానని..  ఇద్దరం కలిసి మోసం  చేద్దామని ప్రతిపాదించాడు.  అంగీకరించిన దీపక్ చౌదరి ఆరు నెలల క్రితం ఢిల్లీలోని వేర్వేరు ప్రాంతాల్లో... మధ్యప్రదేశ్, రాజస్థాన్ లోని హోటళ్లలో సెంటర్లు ఏర్పాటు చేశాడు.  భారీ ఎత్తున టెలీకాలర్ లను నియమించాడు. వారు  ఆర్ బి ఎల్  వినియోగదారుల సేవా కేంద్రాల అధికారుల పేర్లతో ఆర్ బి ఎల్ క్రెడిట్ కార్డు దారులకు ఫోన్లు చేయడం ప్రారంభించారు.

హైదరాబాద్ :  బావ బామ్మర్ది ఇద్దరూ కలిసి వందలాది మంది రత్నాకర్ బ్యాంక్ లిమిటెడ్ క్రెడిట్ కార్డు దారులను మోసగించి, మూడు కోట్ల రూపాయల కొల్లగొట్టిన ఉదంతం ఇది.  సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఎం. స్టీఫెన్ రవీంద్ర బుధవారం విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం..  ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ లో ఉంటున్న దీపక్ చౌదరి ఏడాది నుంచి ఓ కాల్ సెంటర్ నిర్వహిస్తూ.. రుణాలు ఇప్పిస్తానంటూ మోసాలకు పాల్పడుతున్నాడు. 

ఈ విషయాన్ని దీపక్ బావ, RBL Bank అధికారి భాటియా గుర్తించాడు. బ్యాంకులోని లక్షలమంది క్రెడిట్ దారుల సమాచారం  Dataను ఇస్తానని..  ఇద్దరం కలిసి మోసం  చేద్దామని ప్రతిపాదించాడు.  అంగీకరించిన Deepak Chaudhary ఆరు నెలల క్రితం ఢిల్లీలోని వేర్వేరు ప్రాంతాల్లో... మధ్యప్రదేశ్, రాజస్థాన్ లోని హోటళ్లలో Call centers ఏర్పాటు చేశాడు.  భారీ ఎత్తున టెలీకాలర్ లను నియమించాడు. వారు  ఆర్ బి ఎల్  వినియోగదారుల సేవా కేంద్రాల అధికారుల పేర్లతో ఆర్ బి ఎల్ క్రెడిట్ కార్డు దారులకు ఫోన్లు చేయడం ప్రారంభించారు.

పరిమితిని పెంచుతాం,  భీమా సౌకర్యం కల్పిస్తాం,  కార్డు  అప్డేట్ చేసుకోండి అంటూ ప్రతిపాదించే వారు.  స్ఫూఫింగ్ పరిజ్ఞానంతో  ఆర్ బిఎల్ బ్యాంక్ వినియోగదారుల సేవా కేంద్రం ఫోన్ నెంబర్ బాధితుల ఫోన్లలో కనిపిస్తుండడంతో Tele caller లో చెప్పిన మాటలు వందలాది మంది నమ్మరు.  కోడ్ నెంబర్ వస్తుంది.. అని చెప్పగానే ఓటీపీలు చెప్పేశారు. ఇలా బాధితుల నుంచి ఎంత వీలైతే అంత సొమ్మును స్వాహా చేసేశారు.

ఈ మొత్తాన్ని తమ ఖాతాలో వేసుకుంటే పోలీసులకు దొరికిపోతామని అంచనా వేసి సొంత e-commerce sitesను సృష్టించారు.  బాధితులు ఆ వెబ్ సైట్ లో  దుస్తులు, వస్తువులు,  పరికరాలు, యంత్రాలు కొన్నట్టుగా చూపించారు.  ఇందుకోసం నిందితులు  విశాల్ కుమార్, క్రిషన్, కరణ్, గౌరవ్, దుర్గేష్ ప్రత్యేక సాఫ్ట్వేర్ను రూపొం దించారు. బాధితుల నుంచి కొట్టేసిన నగదును తీసుకునేందుకు నకిలీ ఆధార్, పాన్, ఓటర్ కార్డులు సమీకరించుకున్నారు..

సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్‌రావు అరెస్ట్.. 14 రోజుల రిమాండ్ విధించిన జడ్జ్..

వీటి ఆధారంగా సిమ్ కార్డు తీసుకొని ఢిల్లీలోని వేరే బ్యాంకు ఖాతాలు తెరిచారు. సొంత ఈ కామర్స్ సైట్ల లోని నగదును బ్యాంక్ ఖాతాలో జమ చేసి ఎప్పటికప్పుడు డబ్బును విత్డ్రా చేసుకుంటున్నారు.

నగరంలో 34 కేసులు
వీరి మోసాలపై హైదరాబాదులో  34,  దేశ వ్యాప్తంగా 166 కేసులు నమోదయ్యాయి.  బాధితుల ఫిర్యాదుతో  కేసు దర్యాప్తు చేపట్టిన సైబరాబాద్  సైబర్ క్రైమ్ పోలీసులు అధికారులు  2 రోజుల క్రితం  ఢిల్లీలోని  ఉత్తమ్ నగర్, మధ్యప్రదేశ్లోని  ఉజ్జయినిలోని  ఓ హోటల్లోని  కాల్ సెంటర్లలో దాడులు నిర్వహించారు.  16 మందిని అదుపులోకి తీసుకుని  వారి నుంచి మూడు కార్లు,  ఒక బైక్,  865 నకిలీ ఓటర్,  ఆధార్,  పాన్ కార్డులు,  1000 సిమ్ కార్డులు  స్వాధీనం చేసుకున్నారు.

 ప్రధాన సూత్రధారి,  ఆర్ బి ఐ బ్యాంకు అధికారి సహా మరో ఆరుగురు నిందితులు పారిపోయారని స్టీఫెన్ రవీంద్ర వివరించారు. వీరి బ్యాంకు ఖాతాల్లోని రూ.15 లక్షలు  స్తంభింపచేశామని  డిసిపి ( నేర పరిశోధన) రోహిణి ప్రియదర్శిని తెలిపారు.
 

click me!