ర్యాపిడో డ్రైవర్ అరాచకం.. ఎనిమిదిమంది అమ్మాయిలకు అర్ధ నగ్న ఫోటోలతో లైంగిక వేధింపులు..

By SumaBala BukkaFirst Published May 25, 2022, 9:40 AM IST
Highlights

ఓ ర్యాపిడో డ్రైవర్ నీచానికి దిగజారాడు. తన బండిమీద ఎక్కిన ఎనిమిది మంది అమ్మాయిల ఫోన్ నెంబర్లకు అర్థనగ్న ఫొటోలు పంపుతూ.. లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. 

హైదరాబాద్ : నగరంలో Rapido driver లైంగిక వేధింపులు తాజాగా వెలుగులోకి వచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తి ఎనిమిదిమంది కాలేజీ అమ్మాయిలకు Message రూపంలో అర్ధ నగ్న ఫోటోలు పెట్టి Sexual harassmentకు గురి చేస్తున్నాడు. అగంతకుడి చిత్రహింసలతో విసిగిపోయిన బాధిత యువతులు షీ టీమ్స్ ను ఆశ్రయించారు. దీంతో  విజయ్ కుమార్ అనే ర్యాపిడో డ్రైవర్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో మొత్తం ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కామవాంఛతో ఇలా ఆడపిల్లల్ని వేధిస్తున్నట్లు విజయ్కుమార్ పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు.

ఇదిలా ఉండగా, మే 19న ఓ కౌన్సిలర్ లైంగిక వేధింపులు ఆంధ్రప్రదేశ్ లో వెలుగులోకి వచ్చాయి. తనను వేధిస్తున్న YCP Councilor మీద వివాహిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. Sri Sathyasai District పెనుకొండ పట్టణంలో బుధవారం ఈ ఘటన జరిగింది. బాధితురాలు తెలిపిన వివరాల మేరకు కౌన్సిలర్ శేషాద్రి కొంతకాలంగా ఆమెను వేధిస్తున్నాడు. ఆమె భర్తను Liquorనికి బానిసచేసి, తరచుగా ఇంటివద్దకు వచ్చి ఇబ్బంది పెడుతున్నాడు. అర్థరాత్రి ఇంటి తలుపు కొట్టడం, రాళ్లు విసరడం చేస్తున్నాడు. 

దీంతో విసిగిపోయిన బాధితురాలు పదిరోజుల క్రితం శేషాద్రిని పెనుగొండ ఆర్టీసీ బస్టాండు వద్ద చెప్పుతో కొట్టింది. అయినా అతడి తీరులో మార్పు రాలేదు. అతడి వికృత చేష్టలు భరించలేక బాధితురాలు బుధవారం  పెనుకొండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వేధింపులు ఆపకపోతే ఆత్మహత్యే శరణ్యమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, బాధితురాలు ఫిర్యాదు చేశారని, విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని ఎస్ఐ రమేష్ బాబు తెలిపారు. 

కాగా, తెలంగాణలోని ఖమ్మంలో మే 16న అదనపు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ బెల్లం ప్రతాప్‌ లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ ఓ మహిళా జూనియర్‌ అడ్వకేట్‌ ఇక్కడి షెడ్యూల్డ్‌ కులాలు, తెగల ఫ్యామిలీ కోర్టుకు రాసిన లేఖ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. లేఖ కాపీ వివిధ వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతోంది.

“నేను ప్రతాప్ వద్ద కోర్టు అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాను. ఆయన ఆఫీసులో కేసులకు హాజరవడం ద్వారా కోర్టు వ్యవహారాలు నేర్చుకున్నాను. ఈ క్రమంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ నన్ను లైంగిక వేధింపులకు గురిచేశాడు. దీనిని నేను చాలాసార్లు వ్యతిరేకించాను. అయినా అతను అలాగే చేస్తున్నాడని, అతను కూడా ఎస్సీ వర్గానికి చెందిన వాడేనని.. న్యాయవాది చంద్రావతి తన లేఖలో పేర్కొన్నారు.

వేధింపులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని.. ఆమె తన కష్టాలను అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోక్సో-1కి వివరించింది. "ఆ సమయంలో ఆయన నన్ను ఓదార్చారు. అతనిలో మార్పు కోసం కొంత వేచి ఉండమని నన్ను కోరారు." మహిళా న్యాయవాదిని ఇకపై వేధించవద్దని, తన పరిమితులను దాటవద్దని అదనపు పీపీ తన సీనియర్‌కు సూచించినట్లు చంద్రావతి ఫిర్యాదులో పేర్కొన్నారు.

కృష్ణమోహన్, పి శ్రీనివాస్ అనే వ్యక్తులు ప్రతాప్‌కు మద్దతుగా నిలిచారని, ఆ ముగ్గురూ తనకు ఇబ్బందులు సృష్టించారని ఆమె అన్నారు. ప్రతాప్‌కు నేను అన్ని విధాలుగా సహకరిస్తే ఆర్టీసీలో న్యాయ సలహాదారు పదవిని ఇస్తానని ప్రతాప్ వాగ్దానం చేశారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన రాష్ట్ర మంత్రితో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, తన కోసం ఏదైనా చేయగలనని ప్రతాప్ ప్రలోభపెట్టే పనిలో భాగంగా పదే పదే చెప్పేవాడని చంద్రావతి చెప్పారు. తాను చేసిన ఆరోపణలపై విచారణకు ఆదేశించి తనకు న్యాయం చేయాలని కోర్టును ఆశ్రయించింది.

click me!