ముదిరిపోయిన స్మగ్లర్లు , ఏకంగా చాక్లెట్ల రూపంలో గంజాయి... పోలీసుల దాడుల్లో వెలుగులోకి

By Siva KodatiFirst Published Dec 23, 2022, 4:43 PM IST
Highlights

చాక్లెట్ల రూపంలో గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తులను మెదక్, ఘట్‌కేసర్ పోలీసులు అరెస్ట్ చేశారు. కంపెనీల్లో పనిచేసే కార్మికులు, విద్యార్ధులే లక్ష్యంగా ఈ ముఠా దందా సాగిస్తున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. 

పోలీసులు ఎంతగా నిఘా పెడుతున్నా.. ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా హైదరాబాద్‌లో గంజాయి అక్రమ రవాణా యథేచ్చగా సాగుతోంది. తాజాగా చాక్లెట్ల రూపంలో గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తులను మెదక్, ఘట్‌కేసర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఘట్‌కేసర్ సమీపంలోని చర్లపల్లి బస్టాప్ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టగా.. ఓ పాన్ షాపులో 3,286 గంజాయి చాక్లెట్లు దొరికాయి. ఒడిషా నుంచి వీటిని తెచ్చి యువత, విద్యార్ధులు, కార్మికులకు విక్రయిస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. 

Also REad: పుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌ డ్రగ్స్‌ కేసులో పోలీసులు చార్జ్‌షీట్.. 10 మందిపై అభియోగాలు..

ఇక మరో ఘటనలో మెదక్ జిల్లా శివ్వంపేటలో సిగరెట్లు, చాక్లెట్ల రూపంలో గంజాయిని విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సరిహద్దు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కొందరు వ్యక్తులు అక్రమంగా గంజాయిని తీసుకొచ్చి విక్రయిస్తున్నారని పోలీసులు తెలిపారు. కంపెనీల్లో పనిచేసే కార్మికులు, విద్యార్ధులే లక్ష్యంగా ఈ ముఠా దందా సాగిస్తున్నట్లుగా వెల్లడించారు. 

click me!