హైదరాబాద్ ఐటీసీ కోహినూర్ పబ్ వ్యవహారంలో విచారణ కొనసాగుతోంది. దీనికి సంబంధించి బాధిత యువతి, విష్ణులు రాయదుర్గం పోలీసు స్టేషన్‌లో వాంగ్మూలం ఇచ్చారు.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఐటీసీ కోహినూర్ పబ్ (itc kohenur) వ్యవహారంలో విచారణ కొనసాగుతోంది. దీనిలో భాగంగా మంగళవారం రాయదుర్గం పీఎస్‌కు వచ్చారు బాధిత యువతి, విష్ణు. ఐటీసీ కోహినూర్ పబ్‌లో ఓ గ్యాంగ్‌దాడికి పాల్పడిందని విష్ణు చెప్పాడు. తన స్నేహితురాలి పట్ల గ్యాంగ్ అసభ్యంగా ప్రవర్తించిందని ఆయన తెలిపాడు. ఇద్దరు స్నేహితులతో కలిసి పబ్‌కు వెళ్లామని.. ఓ అమ్మాయి మ్యూచ్‌వల్ ఫ్రెండ్ తన స్నేహితులతో వచ్చిందని విష్ణు చెప్పాడు.
పబ్‌లో అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించారని.. అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న వారిని అడ్డుకున్నారని విష్ణు పేర్కొన్నారు. అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో తన ఫ్రెండ్‌ని రేప్ చేస్తామని బెదిరించారని ఆయన తెలిపాడు. తనపై బీర్ బాటిల్‌తో దాడికి తెగబడ్డారని... తనపై దాడి చేసిన వారిలో 8 మంది వున్నారని విష్ణు చెప్పాడు. తనపై దాడికి పాల్పడినవారు పలుకుబడి వున్న వారి పిల్లలేనని ఆయన ఆరోపించాడు. దాడి జరిగిన వెంటనే పబ్ నుంచి ఆసుపత్రికి వెళ్లామని.. స్టార్ హోటల్ సిబ్బంది రిక్వెస్ట్‌తో ఫిర్యాదు చేయలేదని విష్ణు చెప్పాడు. తమపై దాడి చేసిన విజువల్స్ సీసీ కెమెరాల్లో వున్నాయని ఆయన అన్నాడు.
undefined
Also Read:హైదరాబాద్‌లోని పబ్‌లో యువతిపై దాడి.. ఫోన్ నెంబర్ ఇవ్వాలంటూ అసభ్య ప్రవర్తన..
ఇక, ఇటీవల హైదరబాద్ పబ్‌ల్లో చోటుచేసుకుంటున్న ఘటనలు హాట్ టాపిక్‌గా మారుతున్న సంగతి తెలిసిందే. పలు పబ్‌లు నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తూ.. కస్టమర్లను ఆకర్షించేందుకు అడ్డదారులు తొక్కుతున్నాయి. పోలీసులు ఎన్ని హెచ్చరికలు జారీ చేసిన పబ్ యజమాన్యాల తీరు మారడం లేదు. పబ్‌లో వచ్చే యువత విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు. ఇటీవల అమ్నేషియా పబ్‌కు వచ్చిన మైనర్ బాలికను కారులో తీసుకెళ్లిన దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే.