హైదరాబాద్‌లో ఆన్‌లైన్ వ్యభిచారం గుట్టు రట్టు.. ప్రముఖ తెలుగు డైరెక్టర్ వద్ద పనిచేస్తున్న వ్యక్తి అరెస్ట్..

By Sumanth KanukulaFirst Published Feb 4, 2023, 3:57 PM IST
Highlights

హైదరాబాద్‌లో ఆన్‌లైన్ వ్యభిచారం గుట్టు రట్టైంది. ఇందుకు సంబంధించి పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారిని సురేష్ బోయిన, అఖిల్ కుమార్ గుర్తించారు.

హైదరాబాద్‌లో ఆన్‌లైన్ వ్యభిచారం గుట్టు రట్టైంది. ఇందుకు సంబంధించి పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారిని సురేష్ బోయిన, అఖిల్ కుమార్ గుర్తించారు. సురేష్ బోయిన ప్రముఖ తెలుగు డైరెక్టర్‌ దగ్గర పనిచేస్తున్నట్లుగా చెబుతున్నారు. 2017 నుంచి ప్రముఖ డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక, సురేష్.. సినిమాల్లో అవకాశం ఇస్తామని అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. అమ్మాయిలను ట్రాప్ చేసి.. హైదరాబాద్‌లో ప్రముఖులకు పంపుతున్నట్టుగా తెలస్తోంది. 

ముంబై, ఢిల్లీ, బెంగాల్ నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచారంలోకి దించుతున్నారు. అమ్మాయిల ఫొటోలను ఆన్‌లైన్‌లో పెట్టి వ్యభిచార దందా సాగిస్తున్నారు.  గోవాలో, బెంగళూరులోనూ కూడా సురేష్ వ్యభిచారాన్ని నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. 

click me!