యురేనియం తవ్వకాలకు అనుమతి ఇవ్వలేదు: తేల్చేసిన కేటీఆర్

By narsimha lodeFirst Published Sep 15, 2019, 11:19 AM IST
Highlights

నల్లమలలో యురేనియం తవ్వకాల వెలికితీతకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. 

హైదరాబాద్: నల్లమలలో యురేనియం తవ్వకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అనుమతి ఇవ్వలేదని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రకటించారు.

ఆదివారం నాడు శాసనమండలిలో యురేనియంపై ఓ ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. యురేనియం తవ్వకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదన్నారు. భవిష్యత్తులో కూడ అనుమతులు ఇవ్వబోమని కూడ మంత్రి స్పష్టం చేశారు.

యురేనియం విషయంలో  ప్రజా ప్రతినిధులు బాధ్యతతో మాట్లాడాలని ఆయన సూచించారు. యురేనియం ప్రాజెక్టుకు సంబంధించి ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో  2009లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే అనుమతులు ఇచ్చిందని కేటీఆర్ చెప్పారు. ఈ మేరకు 2009 డిసెంబర్ 16వ తేదీన  127 జీవోను ప్రభుత్వం జారీ చేసిందని  ఆయన గుర్తు  చేశారు.

యురేనియం నిక్షేపాలు ఎక్కడెక్కడ ఉన్నాయనే విషయాన్ని అన్వేషించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఈ మేరకు 2016లో రాష్ట్ర అటవీశాఖకు అనుమతుల కోసం ధరఖాస్తులు వచ్చిన విషయాన్ని ఆయన మండలిలో ప్రస్తావించారు.

నిక్షేపాల కోసం  బోర్ల తవ్వినా తర్వాత వెంటనే ఆ బోర్లను పూడ్చివేయాలని ఉదయంపూటే బోర్ల తవ్వకాన్ని చేపట్టాలని  పలు జాగ్రత్తలను అటవీ శాఖ యురేనియం కార్పోరేషన్ కు సూచించిందని  ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.

యురేనియం తవ్వకాలకు సంబంధించి ప్రభుత్వం ఏనాడూ తప్పు చేయలేదన్నారు. భవిష్యత్తులో కూడ తప్పు చేయబోమని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ పర్యావరణ ప్రేమికుడని ఆయన ఈ సందర్భంగా  ప్రజా ప్రతినిధులకు గుర్తు చేశారు.

సంబంధిత వార్తలు

యురేనియం: నల్లమలలో నల్గొండ చరిత్ర పునరావృతమయ్యేనా?

రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ ఫోన్: ఐక్య పోరాటానికి పిలుపు

యురేనియం తవ్వకాలపై కాంగ్రెస్ నిరసన: నాగర్‌కర్నూలు జిల్లాలో ఉద్రిక్తత

నల్లమలని నాశనం చేయొద్దు.. కేటీఆర్ కు ట్యాగ్ చేసిన శేఖర్ కమ్ముల

పవన్ తర్వాత విజయ్ దేవరకొండ సెటైర్స్.. ఏం పీకుతాం దానితో!!

ఎలా అనుమతిస్తున్నారు సార్ ఇదంతా..? అనసూయ ఫైర్!

సేవ్ నల్లమల.. మహేష్ బాబు ఎందుకంత సైలెన్స్?

 

click me!