హైదరాబాద్ నగరంలో రెండు చోట్ల భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. హైదరాబాద్ నగరంలో నార్కొటిక్స్ బ్యూరో అధికారులు 3 కేజీల డ్రగ్స్ స్వాధీనం చేసుకోగా.. మేడ్చల్ జిల్లాలో ఎక్సైజ్ శాఖ అధికారులు రూ. 2 కోట్లు విలువచేసే Drugs స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. ఒకే రోజు రెండు చోట్ల భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. హైదరాబాద్ నగరంలో నార్కొటిక్స్ బ్యూరో అధికారులు 3 కేజీల డ్రగ్స్ స్వాధీనం చేసుకోగా.. మేడ్చల్ జిల్లాలో ఎక్సైజ్ శాఖ అధికారులు రూ. 2 కోట్లు విలువచేసే Drugs స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి ఆస్ట్రేలియాకు పంపించే పార్శిల్‌లో డ్రగ్స్ ఉన్నట్టుగా NCB అధికారులు గుర్తించారు. ఇందులో ఉన్న 3 కిలోల డ్రగ్స్‌ను పట్టుకున్నారు. చెన్నైకు చెందిన వ్యక్తి హైదరాబాద్‌కు పార్సిల్ చేసినట్లు ప్రాథమికంగా నిర్ధరించారు. Chennai నిందితుడిని ఎన్‌సీబీ అధికారులు అరెస్టు చేశారు.
మరోవైపు మేడ్చల్ జిల్లాలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. మూడు ప్రాంతాల నుంచి అధికారులు రూ. 2 విలువచేసే డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు విద్యార్థులకు సరఫరా చేసేందు డ్రగ్స్ తీసుకొచ్చినట్టుగా పోలీసుల విచారణలో తేలింది. వివరాలు.. తనిఖీల్లో భాగంగా కారులో ఉన్న మెపిడ్రిన్ డ్రగ్‌ను ఎక్సైజ్ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి పవన్, మహేశ్ రెడ్డి, రామకృష్ణ గౌడ్ అనే ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ ఉన్నారు. కారును సీజ్ చేశారు. వారి నుంచి మొత్తంగా రూ. 4.92 కిలోల మెపిడ్రిన్‌ను స్వాధీనం చేసుకన్నారు. ప్రధాన నిందితులు ఎస్.కె.రెడ్డి, హనుమంతరెడ్డి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
undefined
Also read: కంగనా రనౌత్ వర్సెస్ జావేద్ అక్తర్.. కంగనాకు భారీ షాక్.. ఆధారాలు లేవని ఆ పిటిషన్ తోసిపుచ్చిన కోర్టు..
పోలీసులకు పక్కా సమాచారం అందడంతో కూకట్‌పల్లిలో ఉంటున్న పవన్‌ను అదుపులోకి తీసుకున్నారు. పవన్ ఇచ్చిన సమాచారంతో మేడ్చల్‌లోని మహేశ్ రెడ్డి ఇంట్లో సోదాలు చేయగా 926 గ్రాముల మెపిడ్రిన్ బయటపడింది. మహేశ్ రెడ్డి ఇచ్చిన సమాచారంతో నాగర్‌కర్నూల్ వాసి అయిన రామకృష్ణగౌడ్ ఇంట్లో సోదాలు చేయగా తన కారులో 4 కిలోల మెపిడ్రిన్ దొరికిందని తెలిపారు. నిందితులను పోలీసులు మీడియా ముదు హాజరుపరిచాడు. ప్రధాన నిందితుల కోసం గాలింపు చేపట్టారు.