డిజిటల్ ఎకానమీకి ఊతమిస్తున్న తెలంగాణ స్టేట్ గ్లోబల్ లింకర్ ప్లాట్ ఫారం : నాస్కామ్

By Siva KodatiFirst Published Aug 24, 2021, 7:14 PM IST
Highlights

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా తీసుకొచ్చిన డిజిటల్ ఇండియా ప్రాజెక్ట్‌లో రాష్ట్ర ప్రభుత్వాలు సైతం పాలుపంచుకుంటున్నాయి. దీనిపై నాస్కామ్ తాజాగా విడుదల చేసిన నివేదికలో రాష్ట్రాల్లో డిజిటల్ ఇండియా ప్రాజెక్ట్ అమలు, దాని పనితీరుపై అనేక కీలక విషయాలు వెల్లడించింది. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించింది. 
 

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా తీసుకొచ్చిన డిజిటల్ ఇండియా ప్రాజెక్ట్‌లో రాష్ట్ర ప్రభుత్వాలు సైతం పాలుపంచుకుంటున్నాయి. దీనిపై నాస్కామ్ తాజాగా విడుదల చేసిన నివేదికలో రాష్ట్రాల్లో డిజిటల్ ఇండియా ప్రాజెక్ట్ అమలు, దాని పనితీరుపై అనేక కీలక విషయాలు వెల్లడించింది. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించింది. 

డిజిటల్ ఇండియాలో భాగంగా ఎంఎస్ఎంఈలకు ఆర్ధికంగా చేయూతనివ్వాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం గ్లోబల్ లింకర్ అనే కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ డీల్‌లో భాగంగా ‘‘తెలంగాణ స్టేట్ గ్లోబల్ లింకర్ ’’ అనే డిజిటల్ నెట్‌వర్కింగ్ ఫ్లాట్‌ఫాంను ప్రారంభించారు. ఈ వేదిక ద్వారా ఎంఎస్ఎంఈ సభ్యులకు డిజిటలైజేషన్, ఈ కామర్స్ స్టోర్, వ్యాపార సామర్థ్యం సాధనాల యాక్సెస్ వంటి అనేక ప్రయోజనాలను అందించనున్నారు. దీనితో పాటు తెలంగాణ ఎంఎస్‌ఎంఈలు.. ప్రపంచ స్థాయి వ్యాపార సమాజానికి కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. 

ఎంఎస్ఎంఈ వ్యాపారాల కోసం డిజిటలైజేషన్ అనేది గేమ్ ఛేంజర్‌లలో ఒకటిగా వుంటుంది. ఎందుకంటే ఇది స్థానిక సరిహద్దులను దాటి వినియోగదారులను తీర్చడంలో సహాయపడుతుంది. తద్వారా వారి లాభం రెండు రెట్లు పెరగడానికి వీలు కల్పిస్తుంది. అంతిమంగా రాష్ట్ర, దేశ జీడీపీలలో వారి సహకారాన్ని గణనీయంగా పెంచుతుంది. ఎంఎస్ఎంఈల వ్యాపార వృద్ధిని సరళంగా, మరింత లాభదాయంగా మార్చాలనే ఉద్దేశంతోనే తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ ఎస్ఎంఈ నెట్ వర్కింగ్ పరిష్కారంగా గ్లోబల్ లింకర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపాయి. 

ఐటీ ఫ్లాట్ ఫారమ్‌‌లు ఎంఎస్ఎంఈలకు డిజిటల్ ప్రొఫైల్‌ను సృష్టించడంతో పాటు ఇతర గ్లోబల్ ఎంఎస్ఎంఈలతో కనెక్ట్ అవ్వడానికి, కొనుగోలుదారులు, సరఫరాదారులను కనుగొనడానికి, ప్రస్తుత వ్యాపార సరళిని తెలుసుకోవడానికి వీలు కల్పిస్తుంది. గ్లోబల్ లింకర్ సీఈవో, కో ఫౌండర్ సమీర్ వాకిల్ మాట్లాడుతూ.. ఎంఎస్ఎంఈల వృద్ధికి డిజిటలైజేషన్ పాత్రను నొక్కి చెప్పారు. 2.3 మిలియన్లకు పైగా ఎంఎస్ఎంఈ సభ్యులకు తమ ఫ్లాట్‌ఫామ్ బలంపై వారి వ్యాపారాన్ని మార్చేందుకు ఎదురుచూస్తున్నామన్నారు. 

ఇక తెలంగాణ ప్రభుత్వంతో పాటు దేశంలోని మరికొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సైతం డిజిటల్ ఇండియాను పలు రంగాల్లో ప్రవేశపెట్టాయి. కేరళ ప్రభుత్వం KITE పేరిట విద్యా వ్యవస్థలో డిజిటలైజేషన్ విధానాన్ని ప్రవేశపెట్టింది. తద్వారా విద్యా రంగాన్ని ఆధునికీకరించాలని సంకల్పించింది. ఇక కర్ణాటక విషయానికి వస్తే.. రైతులకు పీఎం కిసాన్ యోజన పథకం అందించేందుకు గాను ‘‘FRUITS’’ పేరిట ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్ సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అటు ఈశాన్య రాష్ట్రం త్రిపుర ‘‘Jagrut Tripura ’’ పేరిట డిజిటల్ ఫ్లాట్ ఫాంని తీసుకొచ్చింది. దీని ద్వారా ప్రజలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే వివిధ పథకాల అమలులో ఇబ్బందులను అధిగమించడంతో పాటు ప్రజలకు సహయకారిగా వుండేలా ఈ ఫ్లాట్‌ఫామ్‌ని తీర్చిదిద్దారు.
 

click me!