హరికృష్ణ మృతి: కన్నీళ్లు పెట్టుకొన్న మోత్కుపల్లి

By narsimha lodeFirst Published Aug 29, 2018, 4:04 PM IST
Highlights

 మాజీ మంత్రి, టీడీపీ నుండి బహిష్కరణకు గురైన మోత్కుపల్లి నర్సింహులు హరికృష్ణను గుర్తు చేసుకొని కంటతడిపెట్టారు. కొడుకు చనిపోయిన దు:ఖం నుండి కోలుకోకముందే  హరికృష్ణ మరణించడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.


హైదరాబాద్: మాజీ మంత్రి, టీడీపీ నుండి బహిష్కరణకు గురైన మోత్కుపల్లి నర్సింహులు హరికృష్ణను గుర్తు చేసుకొని కంటతడిపెట్టారు. కొడుకు చనిపోయిన దు:ఖం నుండి కోలుకోకముందే  హరికృష్ణ మరణించడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

బుధవారం నాడు  మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు హరికృష్ణ పార్థీవదేహం వద్ద నివాళులర్పించారు. మానసిక ఒత్తిడి వెంటాడిందో.. ఏం జరిగిందో హరికృష్ణ మృత్యుఒడిలోకి చేరుకొన్నారని మోత్కుపల్లి అభిప్రాయపడ్డారు.

ఎన్టీఆర్ కుటుంబం అంటే తనకు చాలా అభిమానమని ఆయన గుర్తు చేసుకొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడ హరికృష్ణ కూడ ఊరూరా తిరిగారని ఆయన గుర్తు చేసుకొన్నారు. ఈ వయస్సులో ఆయన కారును నడపాల్సి లేకుండేనని ఆయన అభిప్రాయపడ్డారు

ఏ దురదృష్టం వెంటాడిందో.. ఏ పరిస్థితులు ఆయనను ఆ విధంగా నెట్టాయోనని ఆయన ఆవేదన చెందారు. హరికృష్ణ ఒక్కడే రాజకీయాల్లో ధైర్యంగా ముందుకు వెళ్లాడని ఆయన గుర్తు చేసుకొంటూ కంటతడి పెట్టుకొన్నాడు.

రాజకీయాల్లో కూడ హరికృష్ణ వెనక్కు వెళ్లాడని ఆయన చెప్పారు. ఎన్నోసార్లు కలుసుకొన్నామని ఆయన గుర్తు చేసుకొన్నారు. హరికృష్ణ ఆత్మశాంతి కలగాలని కోరుకొన్నాడు.

ఈ వార్తలు చదవండి

హిందూపురంతో హరికృష్ణ బంధం ఇదీ...

హరికృష్ణ: రోజులో ఎక్కువ టైమ్ 1001 రూమ్‌లోనే, ఎందుకంటే?

నందమూరి హరికృష్ణ కుటుంబాన్ని వెంటాడుతున్న రోడ్డు ప్రమాదాలు

రోడ్డు ప్రమాదాలతో టీడీపీకి దెబ్బ: కీలక నేతల దుర్మరణం

నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం: నందమూరి హరికృష్ణ కన్నుమూత

click me!