ప్రధాని మోదీ పర్యటన‌.. నిశ్శబ్దంగా మంత్రి తలసాని నిరసన!.. వందే భారత్ రైలును ప్రారంభిస్తున్న సమయంలో..

Published : Apr 08, 2023, 02:37 PM IST
ప్రధాని మోదీ పర్యటన‌.. నిశ్శబ్దంగా మంత్రి తలసాని నిరసన!.. వందే భారత్ రైలును ప్రారంభిస్తున్న సమయంలో..

సారాంశం

ప్రధాని నరేంద్ర మోదీ  సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించారు. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నిశ్శబ్దంగా తన నిరసనను తెలియజేశారు.

ప్రధాని నరేంద్ర మోదీ  సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ నుంచి ఈ రైలుకు పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, కిషన్ రెడ్డి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు పాల్గొన్నారు. అయితే తలసాని శ్రీనివాస్ యాదవ్.. ఈ కార్యక్రమంలో పాల్గొన్నప్పటికీ.. నిశ్శబ్దంగా తన నిరసనను తెలియజేసినట్టుగా కనిపించింది. వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించినప్పుడు వేదికపై ఉన్న ఇతరులతో పాటు మంత్రి తలసాని చప్పట్లు కొట్టలేదు.

అక్కడ తలసాని శ్రీనివాస్ మూగ ప్రేక్షకుడిలా కనిపించి.. ఇతరుల మాదిరిగా చప్పట్లు కొట్టకుండా తప్పించుకున్నారు. తొలుత  కొద్దిగా చప్పట్లు కొట్టినట్టుగా కనిపించినప్పటికీ.. పక్కన ఉన్న కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, అశ్వినీ వైష్షవ్, తెలంగాణ  గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌ల మాదిరిగా కూడా చాలా సైలెంట్‌గా కనిపించారు. ఆ వెంటనే తన చేతులను వేరే చేశారు. అక్కడ కనిపించిన దృశ్యాలు చూస్తే.. తలసాని చేతులు ముడుచుకున్నట్లు కనిపిస్తుంది.

Also Read: కుటుంబ పాలన, అవినీతి వేర్వేరు కాదు: కెసిఆర్ కు ప్రధాని మోడీ చురకలు

Also Read: సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన మోదీ.. వివరాలు ఇవే..

ఇదిలా ఉంటే..  ఈరోజు ఉదయం బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రధాని మోదీకి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్,  మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, అశ్విని వైష్ణవ్, తెలంగాణ  సీఎస్ శాంతి కుమారి, డీజీపీ అంజనీ  కుమార్, ఎంపీలు బండి  సంజయ్, లక్ష్మణ్, బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల  రాజేందర్, రఘునందన్ రావు, జీహెచ్‌ఎంసీ మేయర్ విజయలక్ష్మి.. తదితరులు స్వాగతం పలికారు. అయితే గత కొంతకాలంగా తెలంగాణ పర్యటనలకు ప్రధాని మోదీ వస్తున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలుకుతున్న సంగతి తెలిసిందే. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Hyderabad IT Jobs : మీరు సాప్ట్ వేర్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారా..? కాగ్నిజెంట్ లో సూపర్ ఛాన్స్, ట్రై చేయండి
ఇప్పుడే కొనేయండి.. హైద‌రాబాద్‌కు దూరంగా అభివృద్ధికి ద‌గ్గ‌ర‌గా.. ఈ గ్రామం మ‌రో గ‌చ్చిబౌలి కావ‌డం ఖాయం.