భావోద్వేగంతోనే రిట్మైర్మెంట్ కామెంట్ చేశా: మంత్రి హరీష్

By Nagaraju TFirst Published Sep 22, 2018, 8:22 PM IST
Highlights

తన పొలిటికల్ రిటైర్ మెంట్ పై మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో హాట్ టాపిగ్ గా మారాయి. ఏనోట విన్నా ఇదే చర్చ. హరీశ్ రావు రిటైర్మెంట్ తీసుకుంటున్నారా....నిజమేనా అన్నదే చర్చ. అయితే ఆ వ్యాఖ్యలు భావోద్వేగంతో చేసినవే తప్ప వేరే ఉద్దేశంతో చేసినవి కాదని మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు.

హైదరాబాద్: తన పొలిటికల్ రిటైర్ మెంట్ పై మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో హాట్ టాపిగ్ గా మారాయి. ఏనోట విన్నా ఇదే చర్చ. హరీశ్ రావు రిటైర్మెంట్ తీసుకుంటున్నారా....నిజమేనా అన్నదే చర్చ. అయితే ఆ వ్యాఖ్యలు భావోద్వేగంతో చేసినవే తప్ప వేరే ఉద్దేశంతో చేసినవి కాదని మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. 

సిద్ధిపేట నియోజకవర్గంలోని ఇబ్రహీంపూర్ గ్రామంలో జరిగిన సభలో పాల్గొనేందుకు వెళ్లగా ప్రజలు చూపించిన ఆదరాభిమానులతో ఒక్కసారిగా భావోద్వేగానికి గురై అలాంటి వ్యాఖ్యలు చేశానన్నారు.  

జోరు వానలో తడుస్తూ ప్రజలు తనపై చూపిన అభిమానంతో భావోద్వేగానికి లోనయ్యానన్నారు. మీ ప్రేమ, అభిమానం చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని.. ఆదరణ ఉన్నప్పుడే గౌరవంగా రాజకీయాల నుంచి తప్పుకోవాలని ఉందన్నాని ఈ జన్మకు తనకు ఇది చాలని అన్నానని తెలిపారు.  

తన వ్యాఖ్యలపై కొంతమంది కావాలనే పెడర్థాలు తీస్తున్నారని మండిపడ్డారు హరీశ్ రావు. టీఆర్ఎస్ పార్టీలో తనకు ప్రాధాన్యం లేదన్నది పడనివాళ్ల ప్రచారం మాత్రమేనని కొట్టిపారేశారు. తనకు టీఆర్ఎస్ పార్టీలో గౌరవమైన గుర్తింపు ప్రాధాన్యత ఉందని చెప్పుకొచ్చారు.  

ఈ వార్తలు కూడా చదవండి

పొలిటికల్ రిటైర్‌మెంట్‌పై హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు

హరీష్ టార్గెట్, కేటిఆర్ కు రస్తా: కేసిఆర్ ప్లాన్ ఇదీ...

నిజమా?: హరీష్ రావుతో భేటీకి కేసిఆర్ నో

కారులో హరీష్ రావు ఉక్కిరిబిక్కిరి: సిద్ధిపేటపై కేసిఆర్ కన్ను

టీఆర్ఎస్ లో ఇంటి పోరు..హరీశ్ కు పొగబెడుతున్న కేసీఆర్: రఘునందన్ రావు

click me!