అధికారంలోకి వచ్చిన 100రోజుల్లో లక్ష ఉద్యోగాలు భర్తీ:రాజనర్సింహ

By Nagaraju TFirst Published 22, Sep 2018, 7:44 PM IST
Highlights

 కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు వరాలు ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని తెలంగాణ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ ప్రకటించారు. 

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు వరాలు ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని తెలంగాణ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ ప్రకటించారు. వివిధ విభాగాల్లో 80 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని అలాగే 20 వేల పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహిస్తామని తెలిపారు. అక్టోబర్ 10లోగా మేనిఫెస్టో కమిటీ నూతన మేనిఫెస్టోను రూపొందిస్తామని స్పష్టం చేశారు. 

మరోవైపు మేనిఫెస్టో అంశాలపై అధ్యయనానికి కమిటీలు ఏర్పాటు చేశామని దామోదర రాజనర్సింహ తెలిపారు. మేనిఫెస్టోలో పొందుపరచాల్సిన అంశాలపై 85238 53852 నెంబర్‌కు ఫోన్ చేసి సూచనలు ఇవ్వొచ్చని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామన్నారు. రుణమాఫీ, నిరుద్యోగ భృతి, ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. 

Last Updated 22, Sep 2018, 7:44 PM IST