Matrimonial Fraud : ‘నువ్వు నాకు నచ్చావ్..పెళ్లి చేసుకుందాం’.. నగ్న వీడియోలు, ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్..

By AN TeluguFirst Published Sep 28, 2021, 11:23 AM IST
Highlights

అటువైపునుంచి సుభాష్ అనే వ్యక్తి  తనను తాను పరిచయం చేసుకున్నాడు. మ్యాట్రిమోనీ సైట్ లో మీ వివరాలు చూశానని,  మీ ప్రొఫైల్ బాగా నచ్చింది అని చెప్పాడు.  తర్వాత తరచూ ఫోన్ లో మాట్లాడుకునే వారు.  ఈ క్రమంలో ఒకసారి కలుద్దామని మాదాపూర్ కి రమ్మన్నాడు.  ఎలాగూ పెళ్లి చేసుకోబోతున్నాం కదా వివరాలు తెలుసుకోవచ్చు... అనుకున్న యువతి అతన్ని కలవడానికి వెళ్లింది.

హైదరాబాద్ : మ్యాట్రిమోనీ వెబ్సైట్ (matrimonial fraud)లో చూశాను.  నువ్వు నాకు బాగా నచ్చావ్.  పెళ్లి చేసుకుందాం.  అంటే ఆ వ్యక్తిని గుడ్డిగా నమ్మింది. కానీ ఆ తర్వాత ఏకాంతంగా గడిపిన క్షణాలు  ఇంటర్నెట్లో (Internet) ప్రత్యక్షం కావడంతో కంగుతింది. సరూర్ నగర్ కు చెందిన బాధితురాలు (30)  మ్యాట్రిమోనీ వెబ్సైట్ (matrimonial website)లో  వివరాలు నమోదు చేసుకుంది.  ఓ రోజు 957320 5940నుంచి ఆమెకు ఫోన్ కాల్ వచ్చింది.

అటువైపునుంచి సుభాష్ అనే వ్యక్తి  తనను తాను పరిచయం చేసుకున్నాడు. మ్యాట్రిమోనీ సైట్ లో మీ వివరాలు చూశానని,  మీ ప్రొఫైల్ బాగా నచ్చింది అని చెప్పాడు.  తర్వాత తరచూ ఫోన్ లో మాట్లాడుకునే వారు.  ఈ క్రమంలో ఒకసారి కలుద్దామని మాదాపూర్ కి రమ్మన్నాడు.  ఎలాగూ పెళ్లి చేసుకోబోతున్నాం కదా వివరాలు తెలుసుకోవచ్చు... అనుకున్న యువతి అతన్ని కలవడానికి వెళ్లింది.

ఎంపీటీసీలు, జడ్పీటీసీలంటే అంత చులకనా?.. మండలిలో ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు

 ఇద్దరు ఏప్రిల్ 27న ఓ రెస్టారెంట్లో కలుసుకున్నారు.  కలిసి భోజనం చేశారు.  ఆ తర్వాత ఆమెను తన గదికి ఆహ్వానించాడు.  అక్కడ వారు ఏకాంతంగా గడిపారు.  ఆ సమయంలో  నిందితుడు  ఆమెకు తెలియకుండా  ఆమె వీడియోలు, ఫోటోలు తీశాడు. కొన్ని రోజుల తర్వాత అవి ఇంటర్నెట్లో ప్రత్యక్షమయ్యాయి.

 విషయం తెలిసిన బాధితురాలు కంగు తింది.  అది ఎలా జరిగిందో అర్థం కాలేదు.  వెంటనే  సుభాష్ కు కాల్ చేసింది. సుభాష్ కూల్ గా అది తన పనేనని  చెప్పడమే కాకుండా.. డబ్బు ఇవ్వాలని లేదంటే సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తానని బెదిరించాడు. దీంతో భయపడ్డ బాధితురాలు  అతనికి అడిగినంత డబ్బులు ఇచ్చింది.  అయినా అతను వాటిని డిలీట్ చేయకపోవడంతో  చివరకు పోలీసులను ఆశ్రయించింది. 
 
click me!