న్యూడ్ ఫొటోలతో బెదిరించి, శారీరక సంబంధం పెట్టుకోవాలని బ్లాక్ మెయిల్.. !!

By AN TeluguFirst Published Jun 22, 2021, 10:20 AM IST
Highlights

మహిళల చిత్రాలను సోషల్ మీడియా ద్వారా సేకరించి అశ్లీల చిత్రాలుగా మార్ఫింగ్ చేసి ఇన్ స్టా గ్రామ్ లో బెదిరింపులకు పాల్పడుతున్న ఓ యువకుడిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సోమవారం రిమాండ్ కు తరలించారు. వివరాలను ఏసీపీ కె.వి.ఎం. ప్రసాద్ వెల్లడించారు. 

మహిళల చిత్రాలను సోషల్ మీడియా ద్వారా సేకరించి అశ్లీల చిత్రాలుగా మార్ఫింగ్ చేసి ఇన్ స్టా గ్రామ్ లో బెదిరింపులకు పాల్పడుతున్న ఓ యువకుడిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సోమవారం రిమాండ్ కు తరలించారు. వివరాలను ఏసీపీ కె.వి.ఎం. ప్రసాద్ వెల్లడించారు. 

సంజీవరెడ్డినగర్ కు చెందిన మహిళకు ఆదివారం రాత్రి ఇన్ స్టాలో గుర్తు తెలియని ఓ అకౌంట్ నుంచి మెసేజ్ వచ్చింది. క్రేజీ ఛాట్ చేయాలని ఉందని అందులో ఉంది. ఆమె తిరస్కరించి ఆ ఖాతాను బ్లాక్ చేశారు. మరో ఖాతానుంచి ఆమెను సంబంధించిన మార్ఫింగ్ చిత్రాలతో పాటు ఓ సినీ నటి చిత్రాన్ని పంపించాడు.

మీ కూతురు ఫొటోను ఈ నటి ఫొటోకు ఎడిట్ చేసి పంపించాలనుందన్నారు. దీంతో ఆమె ఈ అకౌంట్ బ్లాక్ చేసింది. మరో అకౌంట్ నుంచి ఆమె కూతురు ఫొటోను మార్ఫింగ్ చేసి పంపించాడు. అంతేకాదు తనను తిరస్కరిస్తే కూతురు ఫొటోలను వైరల్ చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు హైదరాబాద్ సైబర్ పోలీసులను ఆశ్రయించింది. 

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి, గుండూరుకు చెందిన మొగిలి ఆంజనేయులు(21) హైదరాబాద్ కొత్తపేటలో ఉంటున్నాడు. డిగ్రీ మధ్యలో మాసేని ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు తండ్రి కాపలాదారుడుగా చేస్తున్నాడు. ఆంజనేయులు love_call_me_anji పేరిట ఇన్ స్టా గ్రామ్ లో అకౌంట్ తెరిచాడు. మహిళల ఖాతాలను ఫాలో చేస్తాడు. ఛాటిగ్ లు చేస్తుంటాడు.

ఎవరైనా అతన్ని బ్లాక్ చేస్తే.. రకరకాల పేర్లతో నకిలీ అకౌంట్ లు తెరుస్తాడు. బ్లాక్ చేసిన అకౌంట్ లోని డీపీ ఫొటోలను తీసుకుని న్యూడ్ ఫొటోలకు వారి ముఖాలను తగిలించి నకిలీ అకౌంట్ ల ద్వారా బాధితులకే పంపించి బెదిరింపులకు పాల్పడుతుంటాడు. 

నగ్నంగా తనకు కనిపించాలని, లేదంటే మీ న్యూడ్ పిక్స్ వేరేవాళ్లకు పంపిస్తానంటూ, వైరల్ చేస్తానంటూ బెదిరిస్తాడు. కొందరు ఇతని బెదిరింపులకు లొంగిపోయి అంగీకరించారు కూడా. ఎవరైతే అతను చెప్పింది చేశారో.. వారిని తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలని, లేకపోతే ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తానని హెచ్చరించాడు. అలా ఇప్పటికి 15 మంది ఫొటోలను మార్ఫింగ్ చేశాడని సమాచారం. అయితే ఇదంతా సరదా కోసమే చేశానని నిందితుడు చెప్పడం గమనార్హం. 

click me!