బాలికపై అత్యాచారం చేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ హైదరాబాద్ ఎల్బీ నగర్ లోని కోర్ట్ తీర్పు వెలువరించింది. దీనితో పాటు రూ.2 వేల జరిమానా... బాలికకు బాధితుల పరిహారం కింద రూ.5 లక్షలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది న్యాయస్థానం.
మైనర్ బాలికపై అత్యాచారం (rape) కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ ఎల్బీనగర్ కోర్టు (lb nagar court) మంగళవారం సంచలన తీర్పు వెలువరించింది. 2015లో బాలాపూర్‌కు చెందిన మైనర్ బాలికపై ఇంట్లో ఎవరూ లేని సమయంలో అదే ప్రాంతంలో నివాసం ఉటున్న ఒడిశాకు చెందిన రషీద్, చార్మినార్‌కు చెందిన అక్బర్ ఖాన్‌లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన బాలాపూర్ పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. అయితే, కేసు విచారణలో ఉండగానే నిందితుల్లో ఒకరైన అక్బర్‌ఖాన్ అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ క్రమంలో ఘటనకు సంబంధించి పూర్తి ఆధారాలు సేకరించిన పోలీసులు కోర్టుకు సమర్పించారు. విచారణ జరిపిన ధర్మాసనం.. నిందితుడు రషీద్‌కు 20 ఏళ్లు కఠిన కారాగార శిక్షతో పాటు రూ.2 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. దీంతో పాటు బాలికకు బాధితుల పరిహారం కింద రూ.5 లక్షలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది న్యాయస్థానం.
#ALso REad:కదులుతున్న కారులో ఆరేళ్లకూతురు, తల్లిపై గ్యాంగ్ రేప్...!!
undefined
ఇక మరో కేసులో Uttarakhand, హరిద్వార్‌లోని రూర్కీలో ఒక మహిళ ఆమె ఆరేళ్ల కుమార్తెపై కదులుతున్న కారులో Gangrape జరిగింది. వారిద్దరికీ ఓ వ్యక్తి కారులో lift ఇచ్చాడు. ఆ తరువాత అతను, అతని స్నేహితులు కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు ఆదివారం తెలిపారు. ఆ మహిళ తన ఆరేళ్ల కుమార్తెతో కలిసి రాత్రి సమయంలో ముస్లిం మత ప్రాంతమైన పిరాన్ కలియార్ నుండి ఇంటికి వెళుతుండగా, సోను అనే వ్యక్తి ఆమెకు లిఫ్ట్ ఇచ్చాడని వారు చెప్పారు.
ఆమె కారులోకి ఎక్కే సమయానికే ఆ వ్యక్తి స్నేహితులు కొందరు కారులో ఉన్నారని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (రూరల్) ప్రమేంద్ర దోవల్ తెలిపారు. ఫిర్యాదు ప్రకారం, సోను, అతని సహచరులు ఆమెను కారులోకి ఎక్కించుకున్న తరువాత కదులుతున్న కారులోనే మహిళ, ఆమె కుమార్తెపై అత్యాచారం చేసి అనంతరం కాలువ దగ్గర పడేశారు. దీంతో షాక్ లోకి వెళ్లిన మహిళ.. తేరుకుని అర్థరాత్రి ఎలాగో దగ్గర్లోని పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. జరిగిన విషయాన్ని పోలీసులకు వివరించింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కారులో ఎంత మంది పురుషులు ఉన్నారో మహిళ సరిగ్గా చెప్పలేనప్పటికీ, దానిని నడుపుతున్న వ్యక్తి పేరు సోను అని ఆమె చెప్పింది. బాధితులిద్దరినీ రూర్కీ సివిల్ హాస్పిటల్‌లో చేర్పించామని, వారి వైద్య పరీక్షల్లో అత్యాచారం జరిగినట్లు నిర్ధారించారని పోలీసులు తెలిపారు. దీనిమీద కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు ప్రారంభించామని, అయితే ఇంకా వారి ఆచూకీ లభించలేదని పోలీసులు తెలిపారు.