పసిపాప రేప్, హత్య: తల్లి పొత్తిళ్లలోంచి ఎత్తుకెళ్లి... లాయర్ల సహాయ నిరాకరణ

By Nagaraju penumalaFirst Published Aug 8, 2019, 2:30 PM IST
Highlights

పసిపాప అత్యాచారం హత్య కేసుకు సంబంధించి జూలై 24న ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ ప్రారంభమైంది. ఈనెల 2తో కేసు విచారణ ముగిసింది. 20 రోజుల్లో పోలీసులు ఆధారాలను కోర్టుకు సమర్పించారు. ఈ కేసులో మెుత్తం 51 మంది సాక్షుల్లో అవసరమున్న 30 మందిని మాత్రమే కోర్టులో హాజరుపరిచారు. 
 

వరంగల్: తల్లి పొత్తిళ్లలో సేదతీరుతున్న తొమ్మిది నెలల చిన్నారిపై అత్యంత దారుణంగా అత్యాచారం చేయడంతో పాటు హత్య చేసిన కామోన్మాది ప్రవీణ్ కు వరంగల్ జిల్లా న్యాయవాదుల సహాయ నిరాకరణ చేశారు.  

నేరస్తుడికి ప్రభుత్వం తరపున ఒక న్యాయవాదిని సమకూర్చింది జిల్లా న్యాయస్థానం. అయితే నిందితుడు తరపున వాదించేందుకు న్యాయవాదులు ఎవరూ ముందుకు రాలేదు. దాంతో నిస్సహాయ స్థితిలో ఉండాల్సిన పరిస్థితి ప్రవీణ్ ది. 

మరోవైపు ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు హన్మకొండ పోలీసులు. కేవలం 20 రోజుల్లోనే నేరారోపణలకు సంబంధించి ఆధారాలను కోర్టుకు సమర్పించి రికార్డు సృష్టించారు. 

పసిపాప అత్యాచారం హత్య కేసుకు సంబంధించి జూలై 24న ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ ప్రారంభమైంది. ఈనెల 2తో కేసు విచారణ ముగిసింది. 20 రోజుల్లో పోలీసులు ఆధారాలను కోర్టుకు సమర్పించారు. ఈ కేసులో మెుత్తం 51 మంది సాక్షుల్లో అవసరమున్న 30 మందిని మాత్రమే కోర్టులో హాజరుపరిచారు. 

మరోవైపు ముద్దాయి ప్రవీణ్ సైతం తానే తాగిన మైకంలో అత్యాచారం, హత్యాయత్నానికి పాల్పడినట్లు జిల్లా జడ్జి జయకుమార్ ఎదుట తెలిపాడు. దాంతో జయకుమార్ ప్రవీణ్ ను దోషిగా నిర్ధారించి మరణ శిక్ష విధించారు జడ్జి జయకుమార్.  

ఘటన జరిగిన 53 రోజుల్లో ముద్దాయికి ఉరిశిక్ష విధించడం దేశచరిత్రలో ఇదే ప్రథమం కావడం విశేషం. ఈ తీర్పు ఒక చరిత్రాత్మకమైన తీర్పు అని తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. అటు ప్రజలు సైతం హర్షం వ్యక్తం చేశారు. పోలీసులు, న్యాయవాదులను అభినందిస్తున్నారు. 

ఈ వార్తలు కూడా చదవండి

9నెలల పసికందుపై అత్యాచారం,హత్య కేసు: మరణశిక్ష విధించిన వరంగల్ కోర్టు

9నెలల పసికందుపై అత్యాచారం ఆపైహత్య కేసు:మరికాసేపట్లో తీర్పు వెల్లడి

click me!