మా బాధ ఎవరికి చెప్పుకోవాలి: కేసిఆర్ పై కొండా సురేఖ వ్యాఖ్య

By sivanagaprasad kodatiFirst Published Sep 25, 2018, 11:43 AM IST
Highlights

టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మాజీ మంత్రి కొండా సురేఖ. కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాసిన ఆమె.. ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. 

టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మాజీ మంత్రి కొండా సురేఖ. కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాసిన ఆమె.. ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. అమరవీరుల కుటుంబాలకు ఎక్కడా న్యాయం చేయలేదని.. సీఎం అప్పాయింట్‌మెంట్ కోసం తాను, తన భర్త నాలుగేళ్లు వెయిట్ చేశామని.. మంత్రివర్గంలో చోటు ఇవ్వకపోయిన సర్దుకుపోయానన్నారు.

మేం అడిగిన ప్రశ్నలకు టీఆర్ఎస్ నుంచి సమాధానం లేదని.. ఏ కారణం లేకుండానే టికెట్ ఇవ్వకుండా గెంటేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్, కేటీఆర్‌లు ఫోన్ ఎత్తరని.. చాలామంది నేతలు సీఎం అప్పాయింట్‌మెంట్ ఇప్పించాల్సిందిగా తమను కోరారని.. కానీ మా బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక సమాధానాన్ని దాటవేసేవారమని సురేఖ అన్నారు.

తెలంగాణ ఆవిర్భవించాకా టీఆర్ఎస్‌ను కాంగ్రెస్‌లో కలిపే అంశంపై కేసీఆర్ ఆత్మగౌరవం గురించి చెప్పారని.. టీఆర్ఎస్‌ను కాంగ్రెస్‌లో కలిపితే.. సోనియా, రాహుల్‌ల అపాయింట్‌మెంట్ కోసం నాలుగు గంటల పాటు వెయిట్ చేయాలని అన్నారని.. తెలంగాణ ఆత్మగౌరవం తాకట్టు పెట్టలేనని అన్నారు. కానీ నాడు నాలుగు గంటలు వెయిట్ చేయలేనన్న సీఎం... ప్రజలకు నాలుగేళ్లుగా అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని ఆమె ఎద్దేవా చేశారు.

రేపే ముహూర్తం: కొండా సురేఖ గమ్యం ఎటు వైపు?

మూడు సీట్లు ఆఫర్ చేసిన కేసిఆర్: రాజీకి కొండా సురేఖ నో

కేటీఆర్ మనసులో పెట్టుకొనే నాకు టిక్కెట్టు ఆపేశాడు: కొండా సురేఖ

కార్యకర్తలతో భేటీ: 23 వరకు కొండా సురేఖ వెయిట్

జగన్ ను ఒక్కసారే కలిశా, అలా చేసి ఉండకపోతే: కొండా సురేఖ

తెల్లారి నుంచి కేటీఆర్ ఫోన్ ఎత్తరు, ఆగం పట్టిస్తున్నారు: కొండా సురేఖ

బీసీ మహిళను అవమానించారు, కన్నీళ్లు పెట్టుకున్నా: కొండా సురేఖ

click me!