అత్తతో అల్లుడు అక్రమసంబంధం..నరికి చంపిన మామ

Published : Sep 25, 2018, 11:35 AM IST
అత్తతో అల్లుడు అక్రమసంబంధం..నరికి చంపిన మామ

సారాంశం

తన భార్యను తనకు కాకుండా దూరం చేశాడనే కక్షతో గొడ్డలితో తలపై నరికాడు. తీవ్రగాయాలపాలైన లింగన్నను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు.

సొంత మేనల్లుడిని ఓ మామ.. గొడ్డలితో నరికి చంపేశాడు. ఈ సంఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే...కొత్తతండాకు చెందిన బానోత్‌ భద్రు, మాలోతు లింగన్న(24) వరుసకు మామ అల్లుళ్లు. భద్రు కు పదేళ్లక్రితం ఖమ్మం జిల్లాకు చెందిన యువ తితో వివాహమైంది. వీరికి కుమారుడు ఉన్నా డు. అయితే వరుసకు అత్త అయ్యే ఆమెతో లింగన్నకు వివాహేతర సంబంధం ఏర్పడింది.
 
ఈ విషయం భర్త భద్రుకు తెలియడంతో పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ నిర్వహించగా లింగన్నకు జరిమానా విధించి భద్రు దంపతులను కలిపారు. కొద్దిరోజుల తర్వాత భార్య పుట్టింటికి పోయి సంవత్సరం గడిచినా రాకపోవడంతో భద్రు లింగన్నపై కక్ష పెంచుకున్నాడు. భద్రుకు ఈమె మూడో భార్య కాగా, మొదటి భార్యతో విడాకులు అయ్యాయి. రెండో భార్య అనారోగ్యంతో మృతి చెందింది. మూడో భార్యసైతం తనకు దక్కకుండా పోవడంతో లింగన్న ఎక్కడో దాచిఉంచాడని అనుమానించాడు.

తన భార్యను తనకు కాకుండా దూరం చేశాడనే కక్షతో గొడ్డలితో తలపై నరికాడు. తీవ్రగాయాలపాలైన లింగన్నను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు భద్రు ని అరెస్టు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

శ్రీ సత్యసాయి ట్రస్ట్ కార్యక్రమంలో పాల్గొన్న హీరో విజయ్ దేవరకొండ | Asianet News Telugu
Vijay Deverakonda Superb Speech: విజయ్ దేవరకొండ స్పీచ్ కి సభ మొత్తం అరుపులే | Asianet News Telugu