స్వామిగౌడ్‌తో కొండా దంపతుల భేటీ: ఎమ్మెల్సీ పదవికి మురళి రాజీనామా

By narsimha lodeFirst Published Dec 22, 2018, 10:58 AM IST
Highlights

ఎమ్మెల్సీ పదవికి కొండా మురళి రాజీనామా చేశారు. శనివారం నాడు మండలి ఛైర్మెన్ స్వామిగౌడ్ కు అందించారు.

హైదరాబాద్: ఎమ్మెల్సీ పదవికి కొండా మురళి రాజీనామా చేశారు. శనివారం నాడు మండలి ఛైర్మెన్ స్వామిగౌడ్ కు తన రాజీనాామా పత్రాన్ని అందించారు.

2014 ఎన్నికలకు ముందు కొండా సురేఖ దంపతులు టీఆర్ఎస్ లో చేరారు. ఇటీవల టీఆర్ఎస్ టిక్కెట్టు కొండా సురేఖకు దక్కలేదు. దీంతో కొండా సురేఖ దంపతులు టీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీఆర్ఎస్ లో ఉన్న సమయంలో కొండా మురళి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.

కాంగ్రెస్ పార్టీలో చేరినందున టీఆర్ఎస్ ద్వారా దక్కిన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని కొండా మురళి నిర్ణయం తీసుకొన్నారు.ఈ మేరకు కొండా సురేఖతో కలిసి మురళి శనివారం నాడు శాసనమండలి ఛైర్మెన్ స్వామిగౌడ్‌తో భేటీ అయ్యారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు లేఖను మురళి స్వామిగౌడ్ కు అందించారు.

సంబంధిత వాార్తలు

సండ్ర, మచ్చాలకు టీఆర్ఎస్ గాలం: పార్టీ మార్పుపై తేల్చేసిన ఎమ్మెల్యేలు

కేసీఆర్ దెబ్బ: నాడు టీడీపీ, నేడు కాంగ్రెస్ విల విల

రంగంలోకి ఉత్తమ్: ఆ నలుగురిపై వేటుకు కాంగ్రెస్ డిమాండ్

కేసీఆర్ షాక్: మండలిలో కాంగ్రెస్ఎల్పీ టీఆర్ఎస్‌ఎల్పీలో విలీనం

‘ఏపీలో స్పీకర్, ఛైర్మన్ చట్టాన్ని కాపాడుతున్నారు.. కానీ తెలంగాణలో’’

కేసీఆర్ ప్లాన్ ఇదే: మండలిలో కాంగ్రెస్ గల్లంతు

టీఆర్ఎస్‌లో కాంగ్రెస్ శాసనమండలి ఎల్‌పీ వీలీనం..?

పార్లమెంట్‌ ఎన్నికలపై కేసీఆర్ దృష్టి: జనవరి నుండి ప్రచారం

పార్టీ అన్యాయం చేయలేదు.. బాబు ప్రచారం నచ్చలేదు: కాంగ్రెస్ ఎమ్మెల్సీలు

సీఎల్పీ మీటింగ్ జరగలేదు.. ఎవరు చేయిస్తున్నారో అందరికీ తెలుసు: ఉత్తమ్

click me!