ఆదివారం విశాఖ పర్యటనకు కేసీఆర్

By Arun Kumar PFirst Published Dec 22, 2018, 10:29 AM IST
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు(ఆదివారం) విశాఖపట్నానికి వెళ్లనున్నారు. విశాఖలోని శారదా పీఠంలో ప్రత్యేక పూజలు నిర్వహించడానికి ముఖ్యమంత్రి వెళుతున్నట్లు సమాచారం. రెండోసారి ముఖ్యమంత్రిగా అధికారాన్ని చేపట్టిన తర్వాత కేసీఆర్ మొదటిసారి ఆంధ్ర ప్రదేశ్ కు వెళుతుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

ఆదివారం ఉదయం బేగంపేట విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో కేసీఆర్ విశాఖకు బయలుదేరతారు. పదిగంటలకు విశాఖ విమానాశ్రయంలో దిగి అక్కడి రోడ్డు మార్గం ద్వారా చినముషిడివాడలోని శారదా పీఠానికి చేరుకుంటారు. ముందుగా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి స్వామీజి ఆశిస్సులు తీసుకుంటారు. ఆయన సమక్షంలోనే పీఠంలోని రాజశ్యామల దేవాలయంలో కేసీఆర్ కుటుంబంతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. 

అయితే సీఎం కేసీఆర్ విశాఖ పర్యటన వ్యక్తిగతమే అయినప్పటికి రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో తమను ఓడించడానికి ప్రయత్నించిన ఏపి సీఎం చంద్రబాబుకు తగినవిధంగా ప్రతీకారం తీర్చుకుంటానని కేసీఆర్ ఇదివరకే హెచ్చరించారు. అంతే కాదు ఏపి రాజకీయాల్లో వేలు పెట్టడం ఖాయమని స్పష్టం చేశారు. ఇలా సవాల్ చేసిన కేసీఆర్ ఏపిలో పర్యటనకు వెళుతుండటం రాజకీయ వర్గాల్లోనే ఇరు తెలుగు రాష్ట్రాల్లోని సామాన్యుల్లో కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది. 
 
click me!