నామినేటేడ్ పదవుల భర్తీకి రేవంత్ కసరత్తు:కోదండరామ్‌కు ఎమ్మెల్సీ?

By narsimha lodeFirst Published Jan 13, 2024, 11:11 AM IST
Highlights

తెలంగాణ రాష్ట్రంలో  నామినేటేడ్ పదవుల భర్తీ కోసం  కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తుంది.

హైదరాబాద్: నామినేటేడ్ పదవులు,ఎమ్మెల్సీ  స్థానాల భర్తీ కోసం అభ్యర్థుల ఎంపికపై తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి  కసరత్తు ప్రారంభించారు.ఈ విషయమై శనివారం నాడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ దీపాదాస్ మున్షీ, కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కే.సీ. వేణుగోపాల్ తో పాటు  అనుముల రేవంత్ రెడ్డి,  డిప్యూటీ  సీఎం మల్లు భట్టి విక్రమార్క  చర్చించనున్నారు. 

also read:ఆసక్తికరం: చంద్రబాబు ఇంటికి వై.ఎస్. షర్మిల

తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు  ఈ నెల  29న పోలింగ్ జరగనుంది. ఈ నెల  12న  ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. రెండు స్థానాలకు  వేర్వేరుగా  నోటిఫికేష్లను  ఎన్నికల సంఘం విడుదల చేసింది.   ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలను  కాంగ్రెస్ పార్టీ గెలుచుకోనుంది. తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి  64 స్థానాలున్నాయి. కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షం సీపీఐకి  మరో స్థానం ఉంది.  దీంతో కాంగ్రెస్ బలం 65 కి పెరిగింది. ఈ రెండు స్థానాలకు  వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేయడంతో  ఈ రెండు స్థానాలు కాంగ్రెస్ పార్టీకి దక్కనున్నాయి. 

మరో వైపు గవర్నర్ కోటాలో  రెండు ఎమ్మెల్సీ స్థానాలకు  కూడ  ఇద్దరి పేర్లను కాంగ్రెస్ పార్టీ సిఫారసు చేయనుంది.  రాష్ట్రంలో  కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో  దాసోజు శ్రవణ్ కుమార్,  కుర్రా సత్యనారాయణలకు  గవర్నర్ కోటా కింద  ఎమ్మెల్సీ పదవులకు  సిఫారసు చేసింది కేబినెట్. అయితే ఈ ఇద్దరి పేర్లను గవర్నర్ తిరస్కరించారు. దీంతో ఈ రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. దరిమిలా ఈ రెండు స్థానాలకు  కూడ  రెండు పేర్లను  కాంగ్రెస్ భర్తీ చేయనుంది. 

also read:తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి: బీఆర్ఎస్ చెబుతున్న కారణాలివీ..

ఎమ్మెల్యే టిక్కెట్లను త్యాగం చేసిన వారికి ఎమ్మెల్సీ పదవులతో పాటు  నామినేటేడ్ పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వనున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ కు మద్దతుగా నిలిచిన తెలంగాణ జనసమితి  చీఫ్ ప్రొఫెసర్ కోదండరామ్ కు ఎమ్మెల్సీ పదవి దక్కనుంది.  కోదండరామ్ కు  ఎమ్మెల్సీ పదవిని ఇచ్చి మంత్రివర్గంలో కూడ చోటు కల్పించే అవకాశం ఉందనే ప్రచారం కూడ ఉంది. 

మిగిలిన మూడు ఎమ్మెల్సీ పదవులను  బీసీ, మైనార్టీ, ఓసీలకు  ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భావిస్తుంది. ఇప్పటికే ఈ విషయమై రాష్ట్రానికి చెందిన  ముఖ్య నేతలతో రేవంత్ రెడ్డి చర్చించారు.  రాష్ట్ర నేతలతో చర్చించిన తర్వాత జాబితాను పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ దీపాదాస్ మున్షీకి అందించారు.  

ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో జరిగే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని  నామినేటేడ్ పదవులను కట్టబెట్టనున్నారు.  రాష్ట్రంలోని  సుమారు  54 కార్పోరేషన్ పదవులు ఖాళీగా ఉన్నాయి.  ఈ కార్పోరేషన్లలో  వెంటనే  20కిపైగా కార్పోరేషన్లను భర్తీ చేయాలని  ప్రభుత్వం  నిర్ణయం తీసుకుంది. 

also read:టీడీపీలోకి పార్థసారథి?: తెర వెనుక కారణలివీ.....

ఈ నెల  14వ తేదీ  రాత్రికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ధావోస్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనకు ముందే  ఎమ్మెల్సీ స్థానాలతో పాటు  నామినేటేడ్ పదవుల భర్తీకి సంబంధించిన అభ్యర్థుల ఎంపిక పూర్తి చేయాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు.తీన్మార్ మల్లన్న,జాఫర్ జావీద్,  ఫయీమ్ ఖురేషీ,  అజ్మతుల్లా హుస్సేనీ,  అమీర్ అలీఖాన్,  ఫిరోజ్ ఖాన్,  శివసేనా రెడ్డి,బల్మూరి వెంకట్,  షబ్బీర్ అలీ,  చిన్నారెడ్డి, అద్దంకి దయాకర్,  జగ్గారెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, మధు యాష్కీ,  అనిల్ కుమార్ , శోభారాణి తదితరులున్నారు.

also read:సముద్రంపై అతి పొడవైన బ్రిడ్జి: అటల్ సేతు విశేషాలివీ....
 

click me!