సంక్రాంతికి పల్లెబాట: టోల్‌గేట్ల వద్ద వాహనాల రద్దీ, ట్రావెల్స్ బాదుడు

By narsimha lodeFirst Published Jan 13, 2024, 10:19 AM IST
Highlights


హైద్రాబాద్ జనం పల్లెబాట పట్టారు. రోడ్లపైకి ఒకేసారి వాహనాలు రావడంతో పలు చోట్ల  టోల్ గేట్ల వద్ద వాహనాల రద్దీ పెరిగింది.


హైదరాబాద్: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని  స్వంత గ్రామాలకు  జనం బయలుదేరారు. హైద్రాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్ వైపునకు జనం వెళ్తున్నారు.దీంతో  హైద్రాబాద్-విజయవాడ జాతీయ రహదారితో పాటు ఇతర జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులపై  వాహనాల రద్దీ పెరిగింది.  

యాదాద్రి భువనగిరి జిల్లాలోని  బీబీనగర్ మండలం గూడూరు టోల్ ప్లాజా వద్ద  వాహనాల రద్దీ పెరిగింది.  అదే విధంగా ఇదే జిల్లాలోని  చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద  వాహనాలు  బారులు తీరాయి. నల్గొండ జిల్లాలోని కేతేపల్లి మండలం కొర్లపహాడ్ టోల్ ప్లాజా వద్ద  వాహనాల రద్దీ పెరిగింది. 

also read:ఆసక్తికరం: చంద్రబాబు ఇంటికి వై.ఎస్. షర్మిల

హైద్రాబాద్ - వరంగల్ వెళ్లే రహదారిపై  వాహనాల రద్దీ పెరిగింది. ఇక హైద్రాబాద్ - విజయవాడ రహదారిపై  శుక్రవారం నుండే  వాహనాల రద్దీ కొనసాగుతుంది. పంతంగి టోల్ ప్లాజా వద్ద  16 గేట్లున్నాయి. అయితే  హైద్రాబాద్ నుండి విజయవాడ వైపు 10 గేట్లను ఎత్తి  వాహనాలను పంపుతున్నారు.   వాహనాల రద్దీ పెరగకుండా ఉండేందుకు  గాను  ఫాస్టాగ్  స్కాన్ చేసేందుకు  ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశారు.

సాధారణ రోజుల్లో ఈ టోల్ ప్లాజా నుండి  ప్రతి రోజూ 35 నుండి  40 వేల మంది ప్రయాణిస్తుంటాయి.శుక్రవారం నాడు ఒక్క రోజే  55 వేల వాహనాలు  నడిచినట్టుగా  గణాంకాలు చెబుతున్నాయి. నల్గొండ జిల్లా కొర్లపహాడ్ టోల్ గేట్ వద్ద సాధారణ రోజుల్లో  18 నుండి  20 వేల వాహనాలు  ప్రయాణం చేస్తుంటాయి. అయితే  శుక్రవారం నాడు  40 వేల వాహనాలు ప్రయాణం చేసినట్టుగా లెక్కలు చెబుతున్నాయి.

also read:తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి: బీఆర్ఎస్ చెబుతున్న కారణాలివీ..

బీబీనగర్ మండలం గూడూరు  టోల్ ప్లాజా  నుండి  ప్రతి రోజూ  19 నుండి  20 వేల వాహనాలు ప్రయాణం చేస్తుంటాయి. శుక్రవారం నాడు 22 వేల వాహనాలు వెళ్లాయి.హైద్రాబాద్ నుండి విజయవాడకు వెళ్లే విమాన చార్జీలను  పెంచారు. రూ. 3 వేల నుండి  రూ. 5 వేలకు విమాన చార్జీలను వసూలు చేస్తున్నారు.ఇవాళ, రేపు విజయవాడ, రాజమండ్రికి నేరుగా సర్వీసులు లేవు.

also read:సముద్రంపై అతి పొడవైన బ్రిడ్జి: అటల్ సేతు విశేషాలివీ....

సాధారణంగా హైద్రాబాద్ ఎల్‌బీనగర్ నుండి  పంతంగి టోల్ ప్లాజా వద్దకు  ప్రయాణించాలంటే కనీసం  45 నిమిషాల సమయం పడుతుంది.  కానీ, పండుగ వేళ ఈ రోడ్డుపై వాహనాల రద్దీ పెరగడంతో  ఎల్ బీ నగర్ నుండి  పంతంగికి ప్రయాణం చేయాలంటే  కనీసం  గంటన్నరకు పైగా సమయం పడుతుంది. హైద్రాబాద్ నుండి విశాఖ పట్టణానికి  ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు  రూ. 18 వేలకు పైగా వసూలు చేస్తున్నారు. రైల్వేస్టేషన్లు, బస్ స్టేషన్లలో  కూడ  ప్రయాణీకుల రద్దీ పెరిగింది.  బస్సులు, రైళ్లు కూడ  కిక్కిరిసిపోయాయి. 

click me!