ఆసక్తికరం: చంద్రబాబు ఇంటికి వై.ఎస్. షర్మిల

కాంగ్రెస్ పార్టీలో చేరిన వై.ఎస్. షర్మిల తెలుగు దేశం పార్టీ అధినేత  నారా చంద్రబాబును కలవనున్నారు.
 

Congress leader Y.S. Sharmila to meet Nara Chandrababu Naidu lns

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి సోదరి  వై.ఎస్. షర్మిల  శనివారం నాడు  తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు ఇంటికి వెళ్లనన్నారు.  వై.ఎస్. షర్మిల తనయుడు వై.ఎస్. రాజారెడ్డి  వివాహన్ని పురస్కరించుకొని ఆహ్వాన పత్రికను ఇవ్వడానికి షర్మిల స్వయంగా చంద్రబాబు ఇంటికి వెళ్లనున్నారు. 

also read:ఒంగోలు ఎంపీ సీటుపై సస్పెన్స్:మాగుంటకు మరోసారి లక్కు దక్కేనా?

2023 డిసెంబర్ మాసంలో  నారా చంద్రబాబు కుటుంబానికి  వై.ఎస్. షర్మిల క్రిస్‌మస్ గిఫ్ట్ పంపారు. క్రిస్‌మస్ ను పురస్కరించుకొని పంపిన  గిఫ్ట్ ను తీసుకున్న  వై.ఎస్. షర్మిలకు కూడ  లోకేష్  క్రిస్ మస్ గిఫ్ట్ ను పంపారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా  లోకేష్ పంచుకున్నారు.

also read:పాదయాత్రలతో రికార్డ్: వైఎస్ఆర్‌సీపీ నుండి కాంగ్రెస్ వరకు షర్మిల ప్రస్థానమిదీ..

 

ఈ నెల  4వ తేదీన  వై.ఎస్. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ నెల 18వ తేదీన  వై.ఎస్. రాజారెడ్డికి అట్లూరి ప్రియకు  నిశ్చితార్థం ఏర్పాటు చేశారు.  ఈ ఏడాది ఫిబ్రవరి  17వ తేదీన  వివాహం జరిపించనున్నారు. ఈ నెల  2వ తేదీన  ఇడుపులపాయలోని  వైఎస్ఆర్ ఘాట్ ను సందర్శించారు.ఈ నెల  3న  వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిని వై.ఎస్. షర్మిల కలిశారు. వై.ఎస్ .రాజారెడ్డి వివాహ పత్రికను అందించారు.

also read:టీడీపీలోకి పార్థసారథి?: తెర వెనుక కారణలివీ.....

ఈ నెల  7వ తేదీన  తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డిని  వై.ఎస్. షర్మిల కలిశారు.  తన కొడుకు వివాహానికి రావాలని ఆహ్వానించారు.ఈ నెల  9వ తేదీన తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ను కలిశారు.  పెళ్లికి రావాలని ఆహ్వానించారు. ఈ నెల  10వ తేదీన భారత రాష్ట్ర సమితి నేత, మాజీ మంత్రి హరీష్ రావును  కలిశారు షర్మిల. తన కొడుకు  వివాహానికి రావాలని ఆహ్వాన పత్రికను అందించారు. ఈ నెల 12న  తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో  షర్మిల భేటీ అయ్యారు.  రాజారెడ్డి వివాహనికి ఆహ్వానించారు.  ఇవాళ  తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబును కలవనున్నారు. 

also read:లావుకు మద్దతుగా జగన్ వద్దకు: మార్చొద్దని కోరుతున్న నలుగురు ఎమ్మెల్యేలు

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios