కాంగ్రెస్‌తో పొలిటికల్ ఎంట్రీ.. టీఆర్ఎస్‌లో మంత్రి పదవి: పువ్వాడ ప్రస్థానం

By Siva KodatiFirst Published Sep 8, 2019, 4:38 PM IST
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండో విడత కేబినెట్ విస్తరణలో ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్‌కు బెర్త్ కన్ఫార్మ్ అయ్యింది. సీపీఐ కురువృద్ధుడు పువ్వాడ నాగేశ్వరరావు తనయుడైన అజయ్ కుమార్ ఉన్నత విద్యావంతుడు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండో విడత కేబినెట్ విస్తరణలో ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్‌కు బెర్త్ కన్ఫార్మ్ అయ్యింది. సీపీఐ కురువృద్ధుడు పువ్వాడ నాగేశ్వరరావు తనయుడైన అజయ్ కుమార్ ఉన్నత విద్యావంతుడు.

మమతా వైద్య విద్యాసంస్థల అధినేతగా వాటి నిర్వహణను చూసుకునేవారు. రాజకీయాలపై ఆసక్తితో 2014లో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావుపై గెలుపొంది సంచలనం సృష్టించారు.

తెలంగాణ కాంగ్రెస్‌కు అసెంబ్లీలో, మీడియా చర్చల్లో పార్టీ గొంతుకగా మారారు. అయితే 2016లో పువ్వాడ కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి.. టీఆర్ఎస్‌లో చేరారు. ఆ సమయంలో పీసీసీ నాయకత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

పార్టీలో తనను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని.. అయినాసరే ఇన్నాళ్లూ మనసు చంపుకుని పార్టీ కోసం పాటుపడ్డానని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ఎంతో కష్టపడుతున్నా.. ఆ విషయాలపై పార్టీ పెద్దలు తనతో అబద్ధాలు చెప్పించారని వ్యాఖ్యానించారు.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్‌పై పోటీచేసిన పువ్వాడ.. టీడీపీ అభ్యర్ధి నామా నాగేశ్వరరావుపై భారీ మెజార్టీతో గెలుపొందారు. కేసీఆర్ కేబినెట్‌లో ఖమ్మం జిల్లాకు ప్రాతినిధ్యం లేకపోవడంతో పువ్వాడ ఆ లోటును తీర్చనున్నారు.

గడచిన శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పవనాలు బలంగా వీచినప్పటికీ.. ఖమ్మంలో మాత్రం కాంగ్రెస్ పార్టీయే పైచేయి సాధించింది. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్‌ను పటిష్ట పరచాల్సిన బాధ్యత పువ్వాడ అజయ్ కుమార్‌పై ఉంచారని విశ్లేషకుల అంచనా. 

టీఆర్ఎస్‌లో కీలకనేతగా కేటీఆర్: మెడిసిన్‌ కాదని ఐటీ వైపు

టీఆర్ఎస్‌లో ట్రబుల్ షూటర్: రికార్డుల విజేత హరీష్ రావు

భర్త మరణంతో రాజకీయాల్లోకి.. మూడోసారి మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి

బీజేపీ దూకుడు: చెక్ పెట్టే దిశగా కేసీఆర్ ప్లాన్ ఇదీ..

బెర్త్ ఖరారైన అభ్యర్థులకు ఫోన్ కాల్స్: హరీష్ ఉన్నా కేసీఆర్ తర్వాత కేటీఆరే

ఈటలతో నాకు విభేదాలు లేవు: గంగుల

మంత్రి పదవిపై తేల్చేశారా: కేసీఆర్‌తో ఈటల రాజేందర్ భేటీ

కేసీఆర్ కేబినెట్ విస్తరణ: ఉద్వాసన ఎవరికీ

నేడే మంత్రివర్గ విస్తరణ: ఆ ఆరుగురు వీరే....

కేసీఆఆర్ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు: కొత్తగా నలుగురే

కేసీఆర్ కేబినెట్: కేటీఆర్, హరీష్‌లలో ఎవరికి చోటు?

దసరా తర్వాత కేసీఆర్ కేబినెట్ విస్తరణ: హరీష్‌‌కు చోటు, కారణమదేనా

సుఖేందర్ రెడ్డికి కేసీఆర్ బంపర్ ఆఫర్ ఇదే....

click me!