జస్టిస్ ఫర్ దిశ: ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటుకు హైకోర్టుకు లేఖ

By narsimha lode  |  First Published Dec 4, 2019, 1:41 PM IST

దిశ హత్య కేసులో నిందితులకు శిక్ష పడేలా ప్రభుత్వం ప్రయత్నాలను ప్రారంభించింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని తెలంగాన ప్రభుత్వం హైకోర్టుకు లేఖ రాసింది.



హైదరాబాద్: వారం రోజుల క్రితం శంషాబాద్ సమీపంలో గ్యాంగ్‌రేప్‌కు గురై హత్యకు గురై దిశ కేసును తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకొంది. ఈ కేసులో నిందితులకు త్వరగా శిక్ష వేసేందుకు వీలుగా పాస్ట్‌ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు బుధవారం నాడు లేఖ రాసింది.

Also read:జస్టిస్ ఫర్ దిశ: ప్రగతి భవన్ ముట్టడికి యత్నించిన తృప్తి దేశాయ్ అరెస్ట్

Latest Videos

undefined

దిశపై అత్యాచారం, హత్య  ఘటనపై దేశ వ్యాప్తంగా  నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ కేసులో నిందితులు చర్లపల్లి జైలులో ఉ్ననారు. నిందితులను తమ కస్టడీలోకి తీసుకోవాలని షాద్‌నగర్ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Also read:15 రోజుల క్రితమే అమ్మమ్మ: దిశ ఫ్యామిలీపై దెబ్బ మీద దెబ్బ

ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా నిరసనలు సాగుతున్న తరుణంలో కేసును తెలంగాణ సర్కార్ అత్యంత సీరియస్ గా తీసుకొంది. ఈ కేసులో నిందితులకు శిక్ష పడేలా  చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం కోరుకొంటుంది. ఈ ప్రక్రియలో భాగంగానే ఈ కేసు విచారణకు గాను ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని తెలంగాణ హైకోర్టుకు  ప్రభుత్వం లేఖ రాసింది.

తెలంగాణ ప్రభుత్వం తరపున న్యాయశాఖ కార్యదర్శి సంతోష్ రెడ్డి బుధవారం నాడు తెలంగాణ హైకోర్టుకు లేఖ రాశారు. ఈ విషయమై తెలంగాణ హైకోర్టు బుధవారం నాడు సాయంత్రానికి  తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.అంతేకాదు తెలంగాణ ప్రభుత్వం  ఈ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని కోరింది.

click me!