జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు: నిందితుల వెరిఫికేషన్ పూర్తి

By narsimha lodeFirst Published Jun 27, 2022, 7:05 PM IST
Highlights

జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో  నిందితుల వెరిఫికేషన్ సోమవారం నాడు పూర్తైంది. అమ్నేషియా పబ్ నుండి మైనర్ బాలికను తీసుకెళ్లి నిందితులు కారులోనే గ్యాంగ్ రేప్ చేశారు. ఈ ఘటనలో నిందితుల గుర్తింపు ప్రక్రియను జడ్జి సమక్షంలో పోలీసులు పూర్తి చేశారు. కోర్టుల్లోనే నిందితులను బాధితురాలు గుర్తించింది. 

హైదరాబాద్:Jubilee Hills Gang Rape  ఘటనలో నిందితుల వెరిఫికేషన్ పూర్తైంది. ఈ ఏడాది మే 28వ తేదీన  Amnesia Pub నుండి ఇంటి వద్ద దింపుతామని తీసుకెళ్లి Minor Girl పై కారులోనే నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారు. 

మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నిందితుల గుర్తింపు ప్రక్రియను సోమవారం నాడు పోలీసులు పూర్తి చేశారు. న్యాయమూర్తి సమక్షంలోనే నిందితులను బాధితురాలు గుర్తించారు. తొలుత Chanchalguda Jail జైలులో ఉన్న ఏ 1 నిందితుడు Saduddin malik ను బాధితురాలు గుర్తించింది. ఆ తర్వాత జువైనల్ హోంలో ఉన్న ఐదుగురు నరిందితులను మైనర్ బాలిక గుర్తించింది.బాధితురాలు చెప్పిన విషయాలను న్యాయమూర్తి నమోదు చేసుకున్నారు.

జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ ఘటనలో పాల్గొన్న ఆరుగురు నిందితులు వేర్వేరుగా బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. ఏ 1నిందితుడు నాంపల్లి కోర్టులో బెయిల్ కోసం ధరఖాస్తు చేసుకొన్నాడు. జువైనల్ జస్టిస్ బోర్డులో మైనర్ నిందితులు బెయిల్ పిటిషన్లు వేశారు. అయితే ఈ ఆరుగురు బెయిల్ పిటిషన్లను ఈ నెల 22న కోర్టులు తిరస్కరించాయి. 

జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు కస్టడీకి తీసుకుని విచారించారు. తొలుత ఏ 1 నిందితుడు సాదుద్దీన్ మాలిక్ ను Custodyలోకి తీసుకున్నారు. ఆ తర్వాత ముగ్గురు Minorను కస్టడీలోకి తీసుకున్నారు. ఇదే కేసులో ఆలస్యంగా అరెస్టైన మరో ఇద్దరు నిందితులకు కూడా జువైనల్ బోర్డు పోలీసుల కస్టడీకి ఇవ్వడంతో వారిని కూడా కస్టడీలోకి తీసుకొని పోలీసులు విచారించారు.ఈ నెల 14న ఆరుగురు నిందితుల కస్టడీ పూర్తైంది. దీంతో సాదుద్దీన్ మాలిక్ ను చంచల్ గూడ జైలుకు తరలించారు. మిగిలిన ఐదుగురు మైనర్లను జువైనల్ బోర్డుకు తరలించారు. 

ఈ ఏడాది మే 28వ తేదీన Amnesia Pub లో గెట్ టూ గెదర్ పార్టీకి మైనర్ బాలిక హాజరైంది. ఈ పార్టీ ముగిసిన తర్వాత  బాలికను ఇంటి వద్ద దింపుతామని చెప్పి కారులో తీసుకెళ్లిన నిందితులు బాలికపై అత్యాచారానికి పాల్పడినట్టుగా పోలీసులు తెలిపారు. 

అయితే బాలిక తండ్రి ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాలికకు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకొంటుంది. అయితే  ఆసుపత్రిలో ఉన్న బాలిక నుండి పోలీసులు స్టేట్ మెంట్  తీసుకున్నారు.తనపై నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులకు బాలిక వివరించింది. మరో సారి బాలిక నుండి పోలీసులు స్టేట్ మెంట్ ను తీసుకొనే అవకాశం ఉంది.ఈ కేసు విషయమై ప్రభుత్వం తీరుపై విపక్షాలు విమర్శలు చేశాయి. ఈ కేసులో నిందితులు ప్రజా ప్రతినిధుల పిల్లలు కావడంతో కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని విపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేశాయి. అయితే ఈ ఆరోపణలను ప్రభుత్వం తోసిపుచ్చింది. విపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవాలు లేవని తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ చెప్పారు. ఈ కేసులో ఎవరికి మినహాయింపులు లేవని చెప్పారు.

also read:Amnesia Pub Rape Case : వీడియోలు ఎందుకు తీశారు? అవి ఎలా బయటికి వచ్చాయి? వైరల్ గా ఎలా మారాయి?

కారులోనే మైనర్ బాలికపై నిందితులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారానికి పాల్పడిన తర్వాత బాదితురాలిని నిందితులు పబ్ వద్ద వదిలి వెళ్లారు. ఆ తర్వాత బాలిక ఇంటికి వెళ్లింది.  తనపై జరిగిన అఘాయిత్యం గురించి కుటుంబ సభ్యులకు బాలిక చెప్పింది.ఈ విషయమై బాలిక తండ్రి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగు చూశాయి.

click me!