జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్:మైనర్ బాలికపై మెడపై గాయాలకు కారణమిదీ

By narsimha lode  |  First Published Jun 12, 2022, 11:32 AM IST

జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ ఘటనకు సంబంధించి పోలీసులు నిందితుల నుండి సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఏ 1 నిందితుడు సాదుద్దీన్ మాలిక్ నుండి సేకరించిన వివరాల ఆధారంగా పోలీసులు జువైనల్ హోంలో ఉన్న నిందితుల నుండి  సమాచారం సేకరిస్తున్నారు. 


హైదరాబాద్: Jubilee Hills  Gang Rape ఘటనకు సంబంధించి ఏ 1 నిందితుడు Saad uddin malik  పోలీస్ కస్టడీ ఆదివారంతో పూర్తి కానుంది. ఏ 1 నిందితుడు  సాదుద్దీన్  మాలిక్ ఇచ్చిన సమాచారంతో జువైనల్ హోంలో ఉన్న నిందితులు ఇచ్చిన సమాచారాన్ని పోలీసులు సరిపోల్చుకొంటున్నారు. ఈ కేసులోని ఆరుగురు నిందితులను పోలీసులు విచారిస్తున్నారు. జువైనల్ హోంలో ఐదుగురున్నారు. ముగ్గురిని ఒక్కసారి పోలీస్ కస్టడీకి జువైనల్ హోం అనుమతించింది. ఆలస్యంగా అరెస్టైన మరో ఇద్దరు మైనర్ నిందితులను రెండు రోజుల క్రితం Juvenile Justice  Board అనుమతిని మంజూరు చేసింది. 

తొలుత కోర్టు ఏ1 నిందితుడు మాలిక్ ను Police Custody కి అనుమతిని ఇచ్చింది. మాలిక్ ఇచ్చిన సమాచారం ఆధారంగా జువైనల్ హోంలో ఉన్న ముగ్గురు నిందితులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మాలిక్ ఇచ్చిన సమాచారం ఆధారంగా జువైనల్ హోంలో ఉన్న నిందితులు చెబుతున్న సమాచారం సరిపోలుతుందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Latest Videos

undefined

also read:amnesia pub case: నిందితులకు ఉస్మానియాలో పోటెన్షీ టెస్ట్‌.. రెచ్చగొట్టింది సాదుద్దీనే, మైనర్ల ఆరోపణలు

జువైనల్ హోంలో ఉన్న ముగ్గురు నిందితులను పోలీసులు ప్రశ్నించిన సమయంలో కీలక విషయాలను వెల్లడించినట్టుగా మీడియాలో కథనాలు వచ్చాయి. ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్  ఎన్టీవీ ఈ కథనం మేరకు బాలిక మెడపై గాయాలపై కూడా నిందితులు పోలీసుల విచారణలో కీలక సమాచారం ఇచ్చారు.  టాటూ మాదిరిగా ఉంటుందని మైనర్ బాలిక మెడపై కోరికినట్టుగా నిందితులు చెప్పారని సమాచారం. అయితే బాలిక ప్రతిఘటించడంతో గాయాలయ్యాయని పోలీసుల విచారణలో ఒప్పుకొన్నారని ఆ టీవీ చానెల్ కథనం ప్రసారం చేసింది. 

నిందితులు ఒకరిపై మరొకరు తప్పును మోపుకొనే ప్రయత్నాలు చేసినట్టుగా పోలీసుల అనుమానిస్తున్నారు. అసలు ఏం జరిగిందనే విషయమై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. జూబ్లీహిల్స్ లోని పెద్దమ్మ గుడికి సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి బాలికపై కారులోనే అత్యాచారానికి పాల్పడినట్టుగా నిందితులు పోలీసులకు సమాచారం ఇచ్చినట్టుగా మీడియాలో కథనాలు వచ్చాయి.

ఈ ఏడాది మే 28వ తేదీన Amnesia Pub లో గెట్ టూ గెదర్ పార్టీకి మైనర్ బాలిక హాజరైంది. ఈ పార్టీ ముగిసిన తర్వాత  బాలికను ఇంటి వద్ద దింపుతామని చెప్పి కారులో తీసుకెళ్లిన నిందితులు బాలికపై అత్యాచారానికి పాల్పడినట్టుగా పోలీసులు తెలిపారు. 

అయితే బాలిక తండ్రి ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాలికకు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకొంటుంది. అయితే  ఆసుపత్రిలో ఉన్న బాలిక నుండి పోలీసులు స్టేట్ మెంట్  తీసుకున్నారు.తనపై నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులకు బాలిక వివరించింది. మరో సారి బాలిక నుండి పోలీసులు స్టేట్ మెంట్ ను తీసుకొనే అవకాశం ఉంది.ఈ కేసు విషయమై ప్రభుత్వం తీరుపై విపక్షాలు విమర్శలు చేశాయి. ఈ కేసులో నిందితులు ప్రజా ప్రతినిధుల పిల్లలు కావడంతో కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని విపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేశాయి. అయితే ఈ ఆరోపణలను ప్రభుత్వం తోసిపుచ్చింది. విపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవాలు లేవని తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ చెప్పారు. ఈ కేసులో ఎవరికి మినహాయింపులు లేవని చెప్పారు.

కారులోనే మైనర్ బాలికపై నిందితులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారానికి పాల్పడిన తర్వాత బాదితురాలిని నిందితులు పబ్ వద్ద వదిలి వెళ్లారు. ఆ తర్వాత బాలిక ఇంటికి వెళ్లింది.  తనపై జరిగిన అఘాయిత్యం గురించి కుటుంబ సభ్యులకు బాలిక చెప్పింది.ఈ విషయమై బాలిక తండ్రి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగు చూశాయి.

click me!