hetero drugs: ప్రైవేట్ లాకర్స్‌లో రూ.30 కోట్లు సీజ్, నోటీసులు

By narsimha lodeFirst Published Oct 12, 2021, 2:27 PM IST
Highlights

హెటిరో డ్రగ్స్ సంస్థకు చెందిన ఆరు ప్రైవేట్ లాకర్లలో రూ. 30 కోట్లను సీజ్ చేశారు ఐటీ శాఖాధికారులు. ఆరు రోజులుగా నిర్వహించిన సోదాల్లో ఆదాయ పన్ను శాఖాధికారులు భారీ ఎత్తున నగదును స్వాధీనం చేసుకొన్నారు.

హైదరాబాద్: హెటిరో డ్రగ్స్ సంస్థలో ఆరు రోజులుగా ఆదాయ పన్ను శాఖాధికారుల సోదాల్లో తవ్వినకొద్దీ కరెన్సీ కట్టలు బయటపడుతున్నాయి. 16 ప్రైవేట్ లాకర్స్ ను income tax అధికారులు ఓపెన్ చేశారు.ఈ లాకర్లలో రూ. 30 కోట్లను సీజ్ చేశారు.

also read:హెటిరో డ్రగ్స్ సంస్థల్లో భారీగా నగదు సీజ్: బీరువాల్లో కరెన్సీ కట్టలు

గత వారంలో hetero drugs సంస్థలో ఆదాయ పన్ను శాఖాధికారులు  సోదాలు నిర్వహించారు. ఆరు రాష్ట్రాల్లో సుమారు 60 చోట్ల సోదాలు జరిగాయి. hyderabadలోని అమీర్‌పేట,శ్రీనగర్  కాలనీల్లోని private lockersను అధికారులు తెరిచారు.ఈ లాకర్లలో రూ. 30 కోట్లను ఐటీ అధికారులు సీజ్ చేశారు. ఒక్కో అల్మారాలో రూ.1.5 కోట్ల నుండి రూ. 2 కోట్లను దాచిపెట్టారని ఐటీ అధికారులు ప్రకటించారు.

ఇప్పటికే రూ. 142 కోట్ల నగదును సీజ్ చేశారు. మరో వైపు రూ. 550 కోట్ల లెక్క చూపని నగదును కూడ  ఐటీ అధికారులు గుర్తించారు. కంపెనీకి చెందిన డబ్బులతో భారీ ఎత్తున భూములను హెటిరో సంస్థ యాజమాన్యం కొనుగోలు చేసిందని ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు.  

ఈ దర్యాప్తులో సేకరించిన కీలక సమాచారం ఆధారంగా ఐటీ శాఖాధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నెల 20వ తేదీ లోపుగా తమ ముందు హాజరు కావాలని హెటిరో డ్రగ్స్ సంస్థ ప్రతినిధులకు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది.

హైద్రాబాద్ నగరంలోని చిన్న చిన్న అపార్ట్‌మెంట్లను కొనుగోలు చేసి మందులుగా నమ్మించి అట్టపెట్టెల్లో కరెన్సీ కట్టలను దాచిపెట్టింది హెటిరో డ్రగ్స్ సంస్థ. ఈ  అపార్ట్ మెంట్లలో నిల్వ ఉంచిన నగదును లెక్కించేందుకు రెండు రోజుల సమయం పట్టిందని ఐటీ అధికారులు మీడియాకు వివరించారు. కరోనా సమయంలో హెటిరో సంస్థ చేసుకొన్న ఒప్పందాలతో పాటు ఇతర కీలకమైన డాక్యుమెంట్లను కూడ స్వాధీనం చేసుకొన్నామని ఐటీ అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే.


 

click me!