హైద్రాబాద్‌హెటిరో డ్రగ్స్ సంస్థలో ఐటీ సోదాలు: 20 బృందాల తనిఖీలు

By narsimha lodeFirst Published Oct 6, 2021, 11:24 AM IST
Highlights

హెటిరో డ్రగ్స్ కార్యాలయాల్లో ఐటీ అధికారులు బుధవారం నాడు సోదాలు నిర్వహిస్తున్నారు. 20 బృందాలు హైద్రాబాద్ సహా మూడు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నాయి. హెటిరో సంస్థ డైరెక్టర్లు, సీఈఓల కార్యాలయాలు, ఇళ్లలో  ఇవాళ ఉదయం నుండి  ఆదాయ పన్ను శాఖాధికారులు సోదాలు చేస్తున్నారు. 

హైదరాబాద్: హెటిరో డ్రగ్స్  సంస్థ కార్యాలయాలపై బుధవారం నాడు ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. hetero drugs సంస్థ డైరెక్టర్లు, సీఈఓల కార్యాలయాలు, ఇళ్లలో  ఇవాళ ఉదయం నుండి  ఆదాయ పన్ను శాఖాధికారులు సోదాలు చేస్తున్నారు.

also read:సోనూసూద్ ఇల్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు, 20 గంటలపాటు శోధన..

హైద్రాబాద్ తో పాటు మరో మూడు ప్రాంతాల్లో income tax అధికారులు తనిఖీలు చేస్తున్నారు.సుమారు 20 ఐటీ అధికారుల బృందం సోదాలు నిర్వహిస్తోంది.  పన్ను ఎగవేతకు సంబంధించి హెటిరో కార్యాలయాలపై ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. 

కోవిడ్ రోగుల కోసం హెటిరో డ్రగ్స్ సంస్థ ఇటీవలనే టోసిలిజుమాబ్ అనే మందును తయారు చేసింది.  Tocilizumab కి డీసీజీఐ అనుమతి ఇచ్చిందని హెటిరో డ్రగ్స్ సంస్థ తెలిపింది.స్టెరాయిడ్ ల స్థానంలో corona తీవ్రంగా సోకిన వారికి లేదా ఆక్సిజన్ వెంటిటేషన్ అవసరమైన వారికి ఉపయోగించడానికి లైసెన్స్ పొందాయి.

 టోసిలిజుమాబ్ ను హెటిరో హెల్త్ కేర్ దేశ వ్యాప్తంగా సరఫరా చేస్తోందని హెటిరో గ్రూప్ ఛైర్మెన్ డాక్టర్ పార్ధసారథి రెడ్డి ప్రకటించారు. హైద్రాబాద్ కు సమీపంలోని జడ్చర్ల  వద్ద ఉన్న సెజ్ లోని  హెటిరో డ్రగ్స్ కంపెనీలో ఈ మందును తయారు చేస్తున్నట్టుగా ఆయన తెలిపారు.

హెటిరో డ్రగ్స్ సంస్థలో ఐటీ దాడులకు సంబంధించి ఆదాయ పన్ను శాఖాధికారుల దాడులకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు అందాల్సి ఉంది.  ఈ అంశానికి సంబంధించి ఐటీ శాఖాధికారులు ఇవాళ సాయంత్రానికి సోదాలకు సంబంధించిన సమాచారాన్ని మీడియాకు అందించే అవకాశం ఉంది.

 

 

click me!