తాళాలు పగలకొట్టి మరీ రేవంత్ ఇంట్లోకి అధికారులు

By ramya neerukondaFirst Published Sep 27, 2018, 1:58 PM IST
Highlights

రంగంలోకి దిగిన అధికారులు ఇంటి తాళాలు పగులకొట్టి లోపలికి ప్రవేశించారు. హైదరాబాద్‌తో సహా పలుచోట్ల అధికారులు సోదాలు చేస్తున్నారు. రేవంత్ కుటుంబ సభ్యుల ఫోన్‌లను అధికారులు స్విచాఫ్ చేయించారు. 

కాంగ్రెస్ నేత రేవంత్ ఇంట్లో ఈ రోజు ఉదయం నుంచి ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.  అయితే.. అధికారులు సోదాలు చేయడానికి వెళ్లిన సమయంలో రేవంత్ ఇంట్లో ఎవరూ లేరట. దీంతో.. అధికారులు రేవంత్ ఇంటి తాళాలు పగలకొట్టి మరీ సోదాలు చేస్తున్నారట. మొదట.. ఇంటికి తాళాలు తీయాలని పనిమనుషులను ఐటీ అధికారులు అడగటంతో.. మా సార్‌కు ఫోన్ చేయాలని వారు బదులిచ్చారు. 

దీంతో రంగంలోకి దిగిన అధికారులు ఇంటి తాళాలు పగులకొట్టి లోపలికి ప్రవేశించారు. హైదరాబాద్‌తో సహా పలుచోట్ల అధికారులు సోదాలు చేస్తున్నారు. రేవంత్ కుటుంబ సభ్యుల ఫోన్‌లను అధికారులు స్విచాఫ్ చేయించారు. 
 
కాగా.. ఉదయం నుంచి సోదాలు జరుగుతున్నాయి. ఇంత వరకు అధికారులు ఏమేం గుర్తించారు అనే విషయాలు తెలియరాలేదు. మధ్యాహ్నం నాలుగు గంటలకు రేవంత్‌కు సంబంధించిన ఇళ్లలో ఏం గుర్తించారు..? వారి బంధువుల ఇళ్లలో ఏమేం గుర్తించారు..? సెబాస్టియన్ ఇంట్లో ఏం గుర్తించారు..? అనే విషయాలన్నింటినీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి అధికారులు వివరాలు వెల్లడిస్తారని సమాచారం.
 
ఇదిలా ఉంటే.. రేవంత్ ఇంటిపై ఐటీ సోదాలు చేయడాన్ని అటు కాంగ్రెస్, ఇటు టీడీపీ నేతలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. ఇది ముమ్మాటికి ప్రభుత్వం కక్షసాధింపు చర్యేనని ఆరోపిస్తున్నారు. ఎన్నికల దగ్గరపడుతుండటంతో పాత కేసులతో కాంగ్రెస్‌ నేతలను అణగదొక్కేందుకు కేసీఆర్‌ యత్నిస్తున్నారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ నేతలపై ఐటీ దాడులు టీఆర్ఎస్ చేతకానితనానికి నిదర్శనమని ఈ సందర్భంగా తీవ్ర విమర్శలు గుప్పించారు. కాగా రేవంత్ రెడ్డి ప్రస్తుతం వికారాబాద్ ప్రచారంలో బిజీబీజీగా ఉన్నారు.

read more news

రేవంత్ రెడ్డి ఇళ్లపై ఐటి దాడులు: వేలు కేసిఆర్ వైపే...

ఒకవైపు ఐటీ దాడులు.. మరోవైపు రేవంత్ ఏం చేస్తున్నాడంటే

రేవంత్‌పై ఐటీ దాడులు...ఆరు నెలల నుంచి అకౌంట్‌లోకి కోట్ల రూపాయలు..?

రేవంత్ రెడ్డి ఇళ్లపై ఐటి దాడుల వెనుక ఆయనే...

ఐటీ దాడులు ముందే ఊహించిన రేవంత్.. అందుకే..?

రేవంత్‌పై ఐటీదాడులు.. ఓడిపోతానేమోనని కేసీఆర్‌కు భయం: ఉత్తమ్

రేవంత్ రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు

click me!