రేవంత్ రెడ్డి ఇళ్లపై ఐటి దాడులు: వేలు కేసిఆర్ వైపే...

By pratap reddyFirst Published Sep 27, 2018, 1:08 PM IST
Highlights

ఏదో విధంగా రేవంత్ రెడ్డిని చిక్కుల్లో పడేసే పని జరుగుతుందని అందరూ ఊహించిందే. రేవంత్ రెడ్డి కూడా దాన్ని ఊహించారు. జగ్గారెడ్డి అరెస్టు, శ్రీశైలంపై కేసు నేపథ్యంలో రేవంత్ రెడ్డికి అటువంటి చిక్కులు తప్పవనే ప్రచారం సాగుతూ వస్తోంది.

హైదరాబాద్: కాంగ్రెసు నేత రేవంత్ రెడ్డి ఇళ్లపై, ఆయన బంధువుల ఇళ్లపై ఐటి దాడులకు ఓటుకు నోటు కేసునే అస్త్రంగా వాడినట్లు తెలుస్తోంది. తెలంగాణ పోలీసులు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి రాసిన లేఖ వల్లనే ఆ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. 

ఓటుకు నోటు కేసు తమ వద్ద దర్యాప్తులో ఉందని, ఇందులో రూ.5 కోట్లు చేతులు మారాయని, ఆ సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందో తేల్చాల్సిన అవసరం ఉందని తెలంగాణ పోలీసులు ఈడీకి లేఖ రాశారని అంటున్నారు. దాంతో రేవంత్ రెడ్డి ఇళ్లపై ఈడి దాడులు జరిగినట్లు చెబుతున్నారు. 

నిజానికి, ఏదో విధంగా రేవంత్ రెడ్డిని చిక్కుల్లో పడేసే పని జరుగుతుందని అందరూ ఊహించిందే. రేవంత్ రెడ్డి కూడా దాన్ని ఊహించారు. జగ్గారెడ్డి అరెస్టు, శ్రీశైలంపై కేసు నేపథ్యంలో రేవంత్ రెడ్డికి అటువంటి చిక్కులు తప్పవనే ప్రచారం సాగుతూ వస్తోంది. రాజకీయ కారణాల వల్లనే రేవంత్ రెడ్డి ఇళ్లపై ఐటి దాడులు జరిగాయనే విషయం ప్రజల్లోకి వెళ్లింది.

ఎలా జరిగినా రేవంత్ రెడ్డి ఇళ్లపై దాడుల విషయంలో వేలు తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కె. చంద్రశేఖర రావు వైపే ఉంటుందనేది అందరికీ తెలిసిన విషయమే. 

ఐటి దాడులతో తమకు సంబంధం లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్ రెడ్డి అన్నారు. ఐటి దాడులు జరిగిన మరుక్షణం దానిపై ఆయన స్పందించారు. ఆయన ప్రటన భుజాలు తడుముకున్నట్లుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

సంబంధిత వార్తలు

ఒకవైపు ఐటీ దాడులు.. మరోవైపు రేవంత్ ఏం చేస్తున్నాడంటే

రేవంత్‌పై ఐటీ దాడులు...ఆరు నెలల నుంచి అకౌంట్‌లోకి కోట్ల రూపాయలు..?

రేవంత్ రెడ్డి ఇళ్లపై ఐటి దాడుల వెనుక ఆయనే...

ఐటీ దాడులు ముందే ఊహించిన రేవంత్.. అందుకే..?

రేవంత్‌పై ఐటీదాడులు.. ఓడిపోతానేమోనని కేసీఆర్‌కు భయం: ఉత్తమ్

రేవంత్ రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు

click me!