తెరపైకి ఓటుకు నోటు కేసు.. సెబాస్టియన్ ఇంట్లోనూ ఐటీదాడులు(వీడియో)

Published : Sep 27, 2018, 01:04 PM ISTUpdated : Sep 27, 2018, 02:35 PM IST
తెరపైకి ఓటుకు నోటు కేసు.. సెబాస్టియన్ ఇంట్లోనూ ఐటీదాడులు(వీడియో)

సారాంశం

 ఇప్పటికే కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి నివాసంలో సోదాలు జరుపుతున్న ఐటీ అధికారులు... ఈ కేసులో ఏ2గా ఉన్న సెబాస్టియన్ ఇంట్లోనూ నిర్వహించారు.

ఓటుకు నోటు కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి నివాసంలో సోదాలు జరుపుతున్న ఐటీ అధికారులు... ఈ కేసులో ఏ2గా ఉన్న సెబాస్టియన్ ఇంట్లోనూ నిర్వహించారు. బంజారాహిల్స్‌ రోడ్డు నెంబర్- 45లోని భోపాల్‌ ఇన్‌ఫ్రా ఆఫీసులో ఐటీ సోదాలు జరుగుతున్నాయి.

ఓటకు నోటు విషయంలో తెలంగాణ నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌ సన్‌కు ఇచ్చిన 50 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయని ఆరా తీస్తున్నట్టు సమాచారం. ముందస్తు అంగీకారం ప్రకారం ఇచ్చిన రూ 50 లక్షలతో పాటు ఇవ్వాలనుకున్న నాలుగున్నర కోట్ల విషయంపైనా ఐటీ అధికారులు దృష్టి సారించారు. రేవంత్‌ రెడ్డికి సంబంధించిన భూపాల్‌ ఇన్‌ఫ్రాస్టక్చర్‌పైనా అధికారులు తనీఖీలు చేస్తున్నారు. గత కొంత కాలంగా ఓటుకు కోట్లు కేసు నత్తనడకన నడుస్తోందని, కేసు నీరుగారుతుందంటూ విమర్శలు వినిపిస్తున్నా తరుణంలో ఐటీ దాడులు రాజకీయవర్గాల్లో ఆసక్తి నెలకొంది.

 గురువారం ఉదయం నుంచి చేపట్టిన ఐటీ సోదాల్లో అసలు దోషులు బయటకి వస్తారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ కేసులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాత్ర, ఆడియో టేపు (బ్రీఫ్డ్‌ మీ), ఆయన డైరెక్షన్‌పై కూడా విచారణ జరుపుతున్నారు. ఈ కేసుకు సంబంధించిన ఆర్థిక లావాదేవిలపై దర్యాప్తు చేయాల్సిందిగా ఈ నెల 13న ఏసీబీ డీజీ పూర్ణచంద్రరావు ఐటీ శాఖకు లేఖ రాశారు. ఏసీబీ లేఖ అందగానే ఆదాయపు పన్ను శాఖ పని ప్రారంభించింది.

"

read more news

ఒకవైపు ఐటీ దాడులు.. మరోవైపు రేవంత్ ఏం చేస్తున్నాడంటే

 

PREV
click me!

Recommended Stories

Hyderabad లో ఏఐ డేటా సెంటర్.. ఈ ప్రాంతం మరో హైటెక్ సిటీ కావడం ఖాయం
Kavitha Kalvakuntla Pressmeet: రేవంత్ రెడ్డి, హరీష్ రావుపై రెచ్చిపోయిన కవిత| Asianet News Telugu