Telangana: మిస్‌వరల్డ్ పోటీలకు ఆ నగరం రెడీ.. ఆ స్కిల్‌ ఉంటే.. మీరే నిర్వహించొచ్చు!

Published : Apr 29, 2025, 03:23 PM IST
Telangana: మిస్‌వరల్డ్ పోటీలకు ఆ నగరం రెడీ.. ఆ స్కిల్‌ ఉంటే.. మీరే నిర్వహించొచ్చు!

సారాంశం

   

మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్‌ సిద్దమవుతోంది. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌ను మే 6 నుంచి జూన్‌ 2వరకు నిర్వహించనున్నారు. ఇక 72వ మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమం నిర్వహణకు అనుభవం ఉన్న ఫ్రొఫెషనల్‌ ఈవెంట్‌ మ్యానేజ్‌మెంట్‌ ఏజెన్సీలను తెలంగాణ పర్యాటక శాఖ ఆహ్వానిస్తోంది. 

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ ఈ సారి మిస్‌ వరల్డ్‌ వేడులకు ఆతిథ్యం ఇస్తోంది. ఈ పోటీలకు ప్రపంచ వ్యాప్తంగా సుమారు140 దేశాల నుంచి అందమైన భామలు.. లేతమెరుపు తీగలు పోటీల్లో పాల్గొనబోతున్నారు. ఇక ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి, తెలంగాణ టూరిజం శాఖ సన్నాహాలు చేస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రపంచానికి తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు, ఇక్కడి పర్యాటక అందాలను చూపించేలా కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. ఈ బాధ్యతలను ఈవెంట్‌ మ్యానేజ్‌మెంట్‌ ఏజెన్సీలకు అప్పగించాలని ప్రభుత్వం చూస్తోంది. 


 
మిస్ వరల్డ్ పోటీలను తెలంగాణలోని వివిధ పర్యాటక ప్రాంతాల్లో నిర్వహించేందుకు వివిధ లొకేషన్లలో కార్యక్రమాలు జరిగేలా టూరిజం శాఖ ప్లాన్‌ చేస్తోంది. తద్వారా తెలంగాణలోని చారిత్రక కట్టడాలు.. వాటి నిర్మాణ అద్భుతాలు, ప్రాంతీయ కళలు, చేతిపనులు, చేనేత వస్త్రాలు, వంటలు తదితర అంశాలను హైలైట్ చేస్తూ రాష్ట్రంలోని ముఖ్యమైన పర్యాటక ప్రాంతాలలో మిస్‌ వరల్డ్‌ పోటీలు నిర్వహించనున్నారు. 

మిస్‌ వరల్డ్‌ పోటీల ద్వారా ప్రధానంగా దేశ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకట్టుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్లాన్‌ చేస్తోంది. దీనికోసం ఆసక్తి ఉన్న అనుభవమున్న ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ ఏజెన్సీలను ఆహ్వానించింది. 


 

వేదిక వద్ద భారీ భద్రత..
ఇక ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ ఏజెన్సీలు ముఖ్యంగా ఈవెంట్ కాన్సెప్ట్‌, విజువలైజేషన్‌, డిజైన్, లాజిస్టిక్స్, సాంస్కృతిక కార్యక్రమాలు, డిజిటల్ టెక్నాలజీ, సౌండ్ సిస్టమ్స్, లైటింగ్, ఇతర మౌలిక సదుపాయాలు, వేడుకలు, ప్రదర్శనలు, పోటీదారుల భద్రతా ఏర్పాట్లను సజావుగా అమలు జరిగేలా చూసుకోవాల్సి ఉంటుంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

వారంలో ఒక్కరోజే ఉండే హైదరాబాద్ చోర్ బజార్. ఎక్కడుంది.? ఎలా వెళ్లాలి.? రూ. 3 వేలకు ఐఫోన్ ఏంటి అసలు
Jeevan Reddy Comments బిఆర్ఎస్ పార్టీకి శాపనార్థాలుపెట్టకు తల్లీ: జీవన్ రెడ్డి | Asianet News Telugu