Injury to KTR: కేటీఆర్‌కు గాయం

Published : Apr 28, 2025, 08:47 PM ISTUpdated : Apr 28, 2025, 09:10 PM IST
Injury to KTR: కేటీఆర్‌కు గాయం

సారాంశం

Injured BRS working president KTR:  భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ క‌ల్వ‌కుంట్ల తార‌క‌రామారావు (కేటీఆర్) గాయ‌ప‌డ్డారు. 

Injured BRS working president KTR:  భార‌త రాష్ట్ర స‌మితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) జిమ్‌లో వర్కౌట్ చేస్తుండగా గాయ‌ప‌డ్డారు. జిమ్ లో వ‌ర్కౌట్ స‌మ‌యంలో న‌డుముకు గాయం అయింద‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా కేటీర్ తెలిపారు. 

గాయం త‌ర్వాత కేటీఆర్ వెంటనే వైద్యులను సంప్రదించగా, బెడ్ రెస్ట్ అవసరమని డాక్టర్లు సూచించారు. ఈ విషయాన్ని కేటీఆర్ ట్వీట్ ద్వారా వెల్లడిస్తూ, త్వరలోనే కోలుకుంటానన్న ఆశాభావం వ్యక్తం చేశారు. 

కేటీఆర్ గాయం గురించి తెలిసి బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. కేటీఆర్ త్వరగా కోలుకోవాలని పోస్టులు పెడుతున్నారు.

 

 

ఎల్కతుర్తి బహిరంగ సభ భారత రాజకీయ చరిత్రలో మైలురాయి: కేటీఆర్ 

 

హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలో నిర్వహించిన భారత రాష్ట్ర సమితి (BRS) రజతోత్సవ బహిరంగ సభ భవిష్యత్తులో భారత రాజకీయ చరిత్రలో ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలుస్తుందని కేటీఆర్ అన్నారు. 

ఈ సభకు హాజరైన భారీ జనసంద్రాన్ని చూశాక, రాష్ట్రంలో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ రజతోత్సవ సభ, బీఆర్ఎస్ పార్టీ శాశ్వత ప్రజా బలానికి ప్రతీకగా నిలిచిందని కేటీఆర్ అభివర్ణించారు. భవిష్యత్తులో ప్రజల కోసం జరిగే ఉద్యమాలకు కేసీఆర్ స్వయంగా నాయకత్వం వహిస్తారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న "వైఫల్యాలు, అన్యాయాలు, అవినీతి"లపై తీవ్ర పోరాటానికి సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cold Wave: వ‌చ్చే 4 రోజులు చుక్క‌లే.. గ‌జ‌గ‌జ వ‌ణకాల్సిందే. ఎల్లో అల‌ర్ట్
Vegetables Price : వీకెండ్ మార్కెట్స్ లో ఏ కూరగాయ ధర ఎంత..?