100కు డయల్ చేస్తే.. బూతులు తిట్టిన కానిస్టేబుల్.. ఇంకా ఏం చేశాడంటే!

By tirumala ANFirst Published Dec 23, 2019, 3:11 PM IST
Highlights

ఇటీవల హైదరాబాద్ లో జరిగిన దిశ హత్య ఘటన తర్వాత ఇబ్బందికర పరిస్థితులలో 100కు డయల్ చేయాలని తెలంగాణ పోలీసులు ప్రజలని కోరారు. దీనిపై పెద్ద ఎత్తున క్యాంపైన్ నిర్వహించారు. కానీ పోలీసుల నుంచి మాత్రం ప్రజలకు సహకారం అంతంతమాత్రంగానే ఉంది. 

ఇటీవల హైదరాబాద్ లో జరిగిన దిశ హత్య ఘటన తర్వాత ఇబ్బందికర పరిస్థితులలో 100కు డయల్ చేయాలని తెలంగాణ పోలీసులు ప్రజలని కోరారు. దీనిపై పెద్ద ఎత్తున క్యాంపైన్ నిర్వహించారు. కానీ పోలీసుల నుంచి మాత్రం ప్రజలకు సహకారం అంతంతమాత్రంగానే ఉంది. 

100కు డయల్ చేస్తే ఆ యువకుడిని కానిస్టేబుల్ బూతులు తిట్టిన సంఘటన సోమవారం తెల్లవారుజామున జరిగింది. సోమవారం తెల్లవారు జామున 2 గంటలకు జీడిమెట్లలోని హెచ్ఎఎల్ కాలనీలో అల్లరిమూకలు గొడవకు దిగారు. వారి నుంచి ఇబ్బందిగా ఉండడంతో ఓ యువకుడు 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసాడు. 

అక్కడికి చేరుకున్న పోలీసులు అల్లరిమూకలని చెదరగొట్టారు. కానీ ఓ కానిస్టేబుల్ మాత్రం ఫోన్ చేసిన యువకుడిపట్ల దురుసుగా ప్రవర్తించాడు. అతడిని బూతులు తిట్టాడు. అర్థరాత్రి పూట ఫోన్ చేసి నిద్ర చెడగొడతావా.. ఎవడెలా పోతే నీకెందుకురా అంటూ ఆ యువకుడిపై కానిస్టేబుల్ దూషణలకు దిగాడు. 

దిశ నిందితుల మృతదేహాలకు ముగిసిన రీపోస్ట్‌మార్టం: కొద్దిసేపట్లో బంధువులకు అప్పగింత

అంతేకాక అతడిని చెంపదెబ్బలు కొట్టి జీడీ మెట్ల పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లాడు. ఆ యువకుడు కుటుంబ సభ్యులతో మాట్లాడకుండా ఫోన్ లాక్కున్నాడు.చివరకు ఆ యువకుడు ఓ మీడియా సంస్థలో పనిచేస్తున్నాడని తెలియడంతో కానిస్టేబుల్ దిగి వచ్చాడు. ఆ యువకుడికి సారీ చెప్పి ఇంటివద్ద జీపులో వదిలిపెట్టాడు. 

రీ పోస్టుమార్టం: దిశ నిందితుల డెడ్‌బాడీలకు నో ఎంబామింగ్

తమ కుమారుడి పట్ల దురుసుగా ప్రవర్తించడంతో ఆ యువకుడి తల్లిదండ్రులు డిజిపి మహేందర్ రెడ్డికి, సైబరాబాద్ సిపి సజ్జనార్ కు ఫిర్యాదు చేశారు. కానిస్టేబుల్ గురించి తెలుసుకున్న సజ్జనార్ అతడిపై చర్యలు తీసుకుంటాం అని తెలిపారు. 

click me!