హైద్రాబాద్‌లో డ్రగ్స్ కలకలం: ముగ్గురు అరెస్ట్

By narsimha lode  |  First Published Jul 4, 2022, 5:54 PM IST


హైద్రాబాద్ నగరంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుండి 30 గ్రాముల ఎండీఎంఎంఏను పోలీసులు సీజ్ చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ ప్రీ సిటీగా చేసేందుకు గాను అన్ని చర్యలు తీసుకోవాలని కూడా సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. గతంలో ఈ విషయమై సమీక్ష నిర్వహించారు


హైదరాబాద్: Hyderabad నగరంలో మరోసారి Drugs  కలకలం రేపాయి. హైద్రాబాద్ SRNagar లో డ్రగ్స్  విక్రయిస్తూ ముగ్గురు Arrest నిందితుల నుండి 30 గ్రామలు MDMA పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ ఫ్రీ సిటీగా మార్చాలని Telangana సీఎం KCR  పోలీసులను ఆదేశించారు. ఈ మేరకు పోలీస్, ఎక్సైజ్ శాఖల అధికారులతో గతంలో ప్రత్యకంగా సమావేశం ఏర్పాటు చేసిన కేసీఆర్ పలు కీలక ఆదేశాలు ఇచ్చారు. 

ఢిల్లీ నుండి డ్రగ్స్ ను తీసుకొచ్చి హైద్రాబాద్ లో విక్రయిస్తున్నారని పోలీసులు గుర్తించారు.పుణెకి చెందిన ప్రధాన నిందితుడు సహా మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరికొందరు పరారీలో ఉన్నారని పోలీసులు చెబుతన్నారు.విద్యార్ధులే లక్ష్యంగా డ్రగ్స్ విక్రయిస్తున్నట్టుగా పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు.

Latest Videos

undefined

అనూప్,మహమ్మద్ అబ్దుల్ నదీమ్ తో పాటు మరొకరిని అరెస్ట్ చేసినట్టుగా  హైద్రాబాద్ వెస్ట్ జోన్ డీసీపీ Joel Davis చెప్పారు.అనూప్ పుణె కేంద్రంగా పెడ్లర్ల ద్వారా డ్రగ్స్ విక్రయిస్తున్నారని డీసీపీ చెప్పారు. సోమవారం నాడు డీసీపీ హైద్రాబాద్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ డ్రగ్స్ ముఠా వివరాలను వెల్లడించారు. ఈ ముఠాతో సంబంధం ున్న ఇద్దరు పరారీలో ఉన్నారన్నారు. రాజా అహ్మద్, శంషీద్దున్ లు పరారీలో ఉన్నారన్నారు. హైద్రాబాద్ లో అబ్దుల్ నదీమ్ తో అనూప్ తన ఏజంట్ గా ఏర్పాటు చేసుకొని డ్రగ్స్ ను సరఫరా చేస్తున్నారని డీసీపీ చెప్పారు.

ఈ నెల రెండో తేదీన రాజేంద్రనగర్ లో కూడా డ్రగ్స్ ను పోలీసులు సీజ్ చేశారు. విదేశాల నుండి చదువు కోసం వచ్చిన వారు డ్రగ్స్ విక్రయిస్తున్నట్టుగా పోలీసులు తెలిపారు. ఆరుగురు నైజీరియన్లను పోలీసులు అరెస్ట్ చేశారు. తమ వీసా గడువు ముగిసినా కూడా హైద్రాబాద్ లో ఉంటూ డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని పోలీసులు చెప్పారు.

also read:హైద్రాబాద్ లో భారీగా డ్రగ్స్ స్వాధీనం: నలుగురు అరెస్ట్

మరో వైపు ఈ ఏడాది మే 24న ధూల్ పేటలో డ్రగ్స్ ను పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు డ్రగ్స్ పెడ్లర్లతో పాటు ఓ ఆఫ్రికన్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.  ఈ ఏడాది మే 8వ తేదీన అంతర్జాతీయ డ్రగ్ పెడ్లర్ ఆశిష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆశీష్ ఫార్మా వ్యాపారం పేరుతో డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు.  కచ్చితమైన సమాచారం ఆధారంగా ఎన్సీబీ అధికారులు ఆశిష్ జైన్  ఇంట్లో సోదాలు నిర్వహించి డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు.

ఆశిష్ జైన్ ఇంట్లో ఎన్సీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో రూ. 3.71 కోట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. విదేశాలకుఆశిష్ జైన్ డ్రగ్స్ ను సరఫరా చేస్తున్నారని ఎన్సీబీ గుర్తించిందిఇంటర్ నెట్ పార్మసీ, జీఆర్ ఇన్‌పీనిటీ పేరుతో ఆశీష్ జైన్ వ్యాపారం చేస్తున్నారని ఎన్సీబీ  అధికారులు తమ దర్యాప్తులో గుర్తించారు. హైద్రాబాద్ సీపీగా సీవీ ఆనంద్ బాధ్యతలు చేపట్టిన తర్వాత  డ్రగ్స్ సరఫరా చేసే వారితో పాటు డ్రగ్స్ తీసుకొనే వారిపై  కేసులు నమోదు చేస్తున్నారు

click me!