Asianet News TeluguAsianet News Telugu

హైద్రాబాద్ లో భారీగా డ్రగ్స్ స్వాధీనం: నలుగురు అరెస్ట్

హైద్రాబాద్ నగరంలో భారీగా డ్రగ్స్ ను పోలీసులు బుధవారం నాడు స్వాధీనం చేసుకున్నారు. 110 గ్రాముల మెథ్ ఫార్మిన్, 20 గ్రాముల కొకైన్ ను పోలీసులు సీజ్ చేశారు. వీసా గడువు దాటినా కూడా నలుగురు విదేశీయులు హైద్రాబాద్ లోనే ఉన్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. వారిని అరెస్ట్ చేశారు. 
 

Hyderabad police bust drug peddling racket, arrest four
Author
Hydedale Road, First Published Jun 29, 2022, 2:20 PM IST

హైదరాబాద్: Hyderabad నగరంలో భారీగా Drugsను పట్టుకున్నారు. ఈ డ్రగ్స్ కేసులో నలుగురిని Police అరెస్ట్ చేశారు. 110 గ్రాముల మెథ్ ఫార్మిన్, 20 గ్రాముల Cocoaine ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.నైజీరియా, టాంజానియా,యెమెన్ వాసులు నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీసా గడువు ముగిసినా కూడా వీరంతా హైద్రాబాద్ లోనే ఉంటున్నట్టుగా పోలీసులు గుర్తించారు.

హైద్రాబాద్  నగరంలోని రాజేంద్ర నగర్ లో ఈ నెల 2న  భారీగా డ్రగ్స్ ను పోలీసులు సీజ్ చేశారు. చదువు కోసం హైద్రాబాద్ కు వచ్చిన నైజీరియన్ విద్యార్ధులకు డ్రగ్స్ విక్రయిస్తున్నారని పోలీసులు తెలిపారు. డ్రగ్స్  విక్రయిస్తున్న ఆరుగురు నైజీరియన్లను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుండి భారీగా కొకైన్ స్వాధీనం చేసుకొన్నారు పోలీసులు.

ఈ ఏడాది మే 24న నగరంలోని థూల్‌పేటలో డ్రగ్స్ ను పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు డ్రగ్స్ పెడ్లర్లతో పాటు ఓ ఆఫ్రికన్ దేశస్తుడిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.  వీరి నుండి కొకైన్, ఇన్నోవా కారును స్వాధీనం చేసుకున్నారు.  అయితే ఈ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. 

 పంజాగుట్ట డ్రగ్స్ కేసులో అరెస్టైన  ఓ వ్యాపారి తన డ్రైవర్ ను ధూల్ పేటలో డ్రగ్స్ కొనుగోలు కోసం పంపిచారని సమాచారం. డ్రగ్స్ కొనుగోలుకు వెళ్లిన డ్రైవర్ లియాఖత్ పోలీసులకు చిక్కాడు. తమ యజమాని కోసమే డ్రగ్స్ కొనుగోలు చేయడానికి వచ్చినట్టుగా  అతను పోలీసులకు సమాచారం ఇచ్చారు. డ్రైవర్ పోలీసులకు పట్టుబడిన విషయం తెలియగానే డ్రగ్స్ కొనుగోలు చేయాలని పంపిన వ్యాపారి పరారీలో ఉన్నాడని పోలీసులు చెప్పారు.

also read:Drugs case: సిద్ధాంత్ కపూర్ డ్రగ్స్ కేసు.. 40 మంది మోడ‌ల్స్ కు పోలీసుల నోటీసులు !

మే నెల 8వ తేదీన  హైద్రాబాద్‌లో అంతర్జాతీయ డ్రగ్స్ పెడ్లర్ ఆశీష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఫార్మా వ్యాపారం పేరుతో ఆశిష్ జైన్ డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారని పోలీసులు చెప్పారు. ఆశిష్ జైన్ ఇంట్లో ఎన్సీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.ఈ సోదాల్లో రూ. 3.71 కోట్లు స్వాధీనం చేసుకొన్నారు. అమెరికాతో పాటు పలు విదేశాలకు  డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని ఎన్సీబీ గుర్తించారు.

ఫార్మా  ముసుగులో ఆశీష్ డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారని  ఎన్‌సీబీ గుర్తించింది., బిట్ కాయిన్, క్రిఫ్టో కరెన్సీ ద్వారా లావా దేవీలు జరిగాయని కూడా అధికారులు గుర్తించారు.ఇంటర్ నెట్ పార్మసీ, జీఆర్ ఇన్‌పీనిటీ పేరుతో ఆశీష్ జైన్ వ్యాపారం చేస్తున్నారని ఎన్సీబీ గుర్తించింది. గత రెండేళ్లలో వెయ్యికి పైగా విదేశాలకు ఆర్డర్లు పంపిన విషయాన్ని కూడా ఎన్సీబీ గుర్తించింది.

న్యూఢిల్లీకి చెందిన ఎన్సీబీ అధికారుల బృందం హద్రాబాద్ లోని హిమాయత్ నగర్ ఇంట్లో సోదాలు నిర్వహించారు.ఈ సోదాల్లో డ్రగ్స్ ను కూడా సీజ్ చేశారు.ఆశీష్ జైన్ సింథటిక్ డ్రగ్స్ ను సరఫరా చేస్తున్నట్టుగా గుర్తించారు. ఈ నెల 5వ తేదీన ఎన్సీబీ అధికారులతో పాటు స్థానికంగా ఉన్న అధికారులు కూడా హైద్రాబాద్ నగరంలో మూడు చోట్ల ఏక కాలంలో సోదాలు నిర్వహించారు. ఆశీష్ జైన్ వెనుక ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios