విశాఖపట్నం సీలేరు నుంచి హైదరాబాద్‌కు గంజాయి.. 70 కిలోలు స్వాధీనం..

By team teluguFirst Published Oct 29, 2021, 9:46 AM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లా సీలేరు నుంచి హైదరాబాద్ (Hyderabad) నగరానికి గంజాయి (Ganja) రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 10.50 లక్షల వివులైన 70 కిలోల గంజాయిని, ఓ ఆటోను స్వాధీనం చేసుకున్నారు. 

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లా సీలేరు నుంచి హైదరాబాద్ (Hyderabad) నగరానికి గంజాయి (Ganja) రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 10.50 లక్షల వివులైన 70 కిలోల గంజాయిని, ఓ ఆటోను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను హైదరబాద్ సీపీ అంజనీ కుమార్ గురువారం మీడియాకు వెల్లడించారు. రంగారెడ్డి  జిల్లా కడ్తాల్ మండలం మైసిగండి గ్రామానికి చెందిన రమావత్ రమేష్ 12 ఏళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చాడు. అక్రమ మద్యం కేసుల్లో అతని పోలీసులు గతంలో అరెస్ట్ చేశారు. అయితే విలాసంతమైన జీవితానికి అలవాటు పడిన రమేష్.. అదే బాటలో ప్రయాణించాడు. ఈ క్రమంలోనే అతనికి అక్రమ మద్యం వ్యాపారం చేసే భరత్ సింగ్‌తో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత భరత్ సింగ్ బావ నర్సింగ్ సింగ్‌ అతనికి పరిచయమ్యాడు. 

రమేష్ తనకు విశాఖ జిల్లా Sileruకు చెందిన గంజాయి సరఫరా ఏజెంట్ రవితో పరిచయం ఉందని నర్సింగ్‌కు చెప్పాడు. దీంతో నర్సింగ్ అక్కడి నుంచి గంజాయి తెచ్చి హైదరాబాద్‌లో విక్రయించేందుకు పథకం వేశాడు. సీలేరు నుంచి గంజాయి తీసుకువచ్చి తనకు అప్పగించాలని నర్సింగ్ రమేష్‌ను కోరాడు. ఇందుకోసం ప్రతి ట్రిప్‌కు రమేష్‌కు రూ. 10వేలు చెల్లించేవాడు. వీరు అక్కడ డిజిటల్ చెల్లింపులు చేసి.. అక్కడి నుంచి సరకు రవాణా చేస్తున్నారు. అలా తెచ్చిన సరుకును నగరంలో విక్రయిస్తున్నారు. 

Also read: ఆన్‌లైన్‌లో పోస్ట్ పెట్టి.. మాజీ మిస్​ తెలంగాణ ఆత్మహత్యాయత్నం.. అదే కారణమా..?

ఈ క్రమంలోనే అక్టోబర్ మూడో వారంలో నిందితుడు నర్సింగ్ గూగుల్ పే ద్వారా రూ. 50వేలు రవికి చెల్లించాడు. 70 కిలోల గంజాయిని పంపమని అడిగాడు. అదే విషయాన్ని మరో నిందితుడు రమేశ్‌కు తెలియజేశాడు. రవి వద్ద నుంచి గంజాయి తీసుకురావడానికి సీలేరుకు వెళ్లాలని చెప్పాడు. దీంతో రమేష్ అక్టోబర్ 17వ తేదీన ఆటోలో సీలేరుకు వెళ్లి 70 కిలోల గంజాయి సేకరించాడు. 21వ తేదీన హైదరాబాద్‌కు చేరుకున్నాడు. ఆ తర్వాత నర్సింగ్‌కు ఫోన్ చేసి సమాచారం అందించాడు. 

Also raed: Huzurabad bypoll: ఓటర్లకు డబ్బు, మద్యం పంపిణీ ఫిర్యాదులపై ఈసీ ఆరా

అయితే మంగళ్‌హాట్ ప్రాంతంలో గంజాయి అమ్మకాలకు అరికట్టేందుకు దాడులు కొనసాగుతున్నాయని.. గంజాయిని వేరే చోట ఉంచాలని నర్సింగ్.. రమేష్‌కు చెప్పాడు. దీంతో రమేష్.. జూబ్లీహిల్స్ లోని రహమత్ నగర్‌లో అద్దెకు తీసుకున్న ఇంట్లో తాను తీసుకొచ్చిన గంజాయిని ఉంచాడు. ఇక, గురువారం నిందితులు రహమాత్ నగర్ ఇంట్లో నుంచి గంజాయిని ఆటోలో ఎక్కించుకుని.. బయలుదేరేందుకు సిద్దమయ్యారు. అయితే అప్పటికే అక్కడున్న వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ బృందం నర్సింగ్, రమేష్‌లను పట్టుకుంది. మొత్తం 35 బండిల్స్‌లో ఉన్న 70 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుంది. వారివద్ద నుంచి ఆటోను కూడా స్వాధీనం చేసుకన్నారు. మరో నిందితుడు రవి పరారీలో ఉన్నారు. అనంతరం తదుపరి విచారణ నిమిత్తం జూబ్లీహిల్స్ ఎస్‌హెచ్‌వోకు అప్పగించారు. 

click me!