హైదరాబాద్‌లో వెలుగులోకి మరో భారీ మోసం.. ఆన్‌లైన్ గేమింగ్, పెట్టబడుల పేరుతో రూ. 2200 కోట్ల చీటింగ్..!

By Sumanth KanukulaFirst Published Jan 29, 2022, 12:14 PM IST
Highlights

హైదరాబాద్‌లో (Hyderabad) మరో భారీ మోసం వెలుగుచూసింది. ఆన్‌లైన్ గేమింగ్ (online gaming), పెట్టుబడుల పేరుతో కేటుగాళ్లు భారీ చీటింగ్‌కు పాల్పడ్డారు. రూ. 2,200 కోట్లకు పైగా మోసం జరిగినట్టుగా రిజిస్టార్ ఆఫ్ కంపెనీస్ గుర్తించింది.

హైదరాబాద్‌లో (Hyderabad) మరో భారీ మోసం వెలుగుచూసింది. ఆన్‌లైన్ గేమింగ్ (online gaming), పెట్టుబడుల పేరుతో కేటుగాళ్లు భారీ చీటింగ్‌కు పాల్పడ్డారు. రూ. 2,200 కోట్లకు పైగా మోసం జరిగినట్టుగా రిజిస్టార్ ఆఫ్ కంపెనీస్ గుర్తించింది. పలు బోగస్ కంపెనీలపై హైదరాబాద్‌ సీసీఎస్‌లో ఫిర్యాదు చేసింది. నకిలీ ధ్రువ పత్రాలు, ఫోర్జరీ సంతకాలతో బోగస్ కంపెనీల నిర్వహించినట్టుగా తెలిపింది. బోగస్ కంపెనీల డైరెక్టర్లు, చైర్మన్లు, ప్రమోటర్లపై ఫిర్యాదు చేయడంతో పాటుగా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. 

ఇక, కేటుగాళ్లు ఆన్‌లైన్ గేమ్స్, పెట్టుబడుల యాప్‌ల పేరుతో నగదు తరలించినట్టుగా తెలుస్తోంది. బోగస్ కంపెనీలు రూ. 2వేల కోట్లకు పైగా తరలించినట్టుగా సమాచారం. డబ్బులను హాంకాంగ్‌ తరలించినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. మాల్ 008, మాల్ 98, YS0123, మాల్ రిబేట్. కామ్ పేర్లతో చైనీయులు ఈ మోసాలకు పాల్పడినట్టుగా తెలుస్తోంది. పెట్టుబడి పేరుతో డబ్బులు వసూలు చేసి మోసాలకు పాల్పడ్డారు. ఇద్దరు చైనీయులు కీలకపాత్ర పోషించినట్టుగా పోలీసులు గుర్తించారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు జరుపుతున్నారు. 

ఇప్పటికే చైనీయులకు బోగస్ కంపెనీలు సమకూర్చిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.  హవాలా మార్గంలో డబ్బు తరలించినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. 
 

click me!