పరువు హత్య: మా నాన్నదే బాధ్యత: అనురాధ సెల్ఫీ వీడియో

Published : Dec 23, 2018, 04:34 PM ISTUpdated : Dec 23, 2018, 05:04 PM IST
పరువు హత్య: మా నాన్నదే బాధ్యత: అనురాధ సెల్ఫీ వీడియో

సారాంశం

 తన ప్రేమను  తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదు.. ప్రియుడితోనే తాను పెళ్లి చేసుకొంటాను.. మాకు ఏమైనా జరిగితే తన తండ్రితో పాటు, గ్రామ సర్పంచ్‌‌దే బాధ్యత అంటూ అనురాధ సెల్పీ వీడియోలో తెలిపారు.  


మంచిర్యాల: తన ప్రేమను  తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదు.. ప్రియుడితోనే తాను పెళ్లి చేసుకొంటాను.. మాకు ఏమైనా జరిగితే తన తండ్రితో పాటు, గ్రామ సర్పంచ్‌‌దే బాధ్యత అంటూ అనురాధ సెల్పీ వీడియోలో తెలిపారు.

ఈ నెల 3వ తేదీన అనురాధ, లక్ష్మణ్ ను హైద్రాబాద్‌ ఆర్యసమాజ్‌లో వివాహం చేసుకొంది. వీరి ప్రేమ విషయం తెలిసిన వెంటనే అనురాధ కుటుంబసభ్యులు లక్ష్మణ్‌పై కేసు పెట్టించారు.

అయితే ఈ ఘటనపై అనురాధ ఈ ఏడాది అక్టోబర్ 24 వ, తేదీన సెల్పీ వీడియోను రికార్డ్ చేసింది. తన ప్రేమ గురించి తాము పెళ్లి చేసుకోబోతున్న విషయాన్ని కూడ అనురాధ సెల్పీ వీడియోలో తేల్చి చెప్పింది.

తాను  లక్ష్మణ్‌ను ప్రేమించినట్టు ఆమె తెలిపింది. లక్ష్మణ్‌ను పెళ్లి చేసుకోకుండా తమ కుటుంబసభ్యులు అడ్డుకొంటున్నారని ఆమె ఆ వీడియోలో  ఆరోపించారు.తమకు ఏమైనా జరిగితే  తన తండ్రితో పాటు గ్రామ సర్పంచ్ కారణమని  బాధితురాలు ఆ వీడియోలో  వివరించారు.

ఈ వీడియోను రెండు మాసాల క్రితం అనురాధ రికార్డు చేశారు. ఇంటి నుండి పారిపోయిన ఆ జంట ఈ నెల 3వ తేదీన హైద్రాబాద్ ఆర్యసమాజ్‌లో వివాహం చేసుకొన్నారు. డిసెంబర్ 22వ తేదీన స్వంత గ్రామానికి వచ్చారు.

గ్రామానికి రాగానే  అనురాధ కుటుంబసభ్యులు లక్ష్మణ్ ఇంటికి వెళ్లి అనురాధను కొట్టుకొంటూ తీసుకెళ్లి చంపేశారు. లక్ష్మణ్  పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు గ్రామానికి చేరుకోనే సమయానికి ఆమెను చంపేశారు.
 

సంబంధిత వార్తలు

పరువు హత్య:లవ్ మ్యారేజీ చేసుకొన్న కూతురును చంపిన పేరేంట్స్

ప్రణయ్ కాంస్య విగ్రహం: అమృతకు అందించిన తమిళనాడు దంపతులు

ప్రణయ్ హత్య నిందితులపై పీడీ యాక్ట్

ప్రణయ్ ఆత్మతో మాట్లాడిస్తాం: అమృత ఏం చేసిందంటే...

అమృతను కించపరుస్తూ కామెంట్...యువకుడు అరెస్ట్

అసభ్యకరమైన పోస్టులు.. పోలీసులకు అమృత ఫిర్యాదు

పోలీసులపై అనుమానం వ్యక్తం చేసిన ప్రణయ్ తండ్రి

ప్రణయ్ హత్య: ఎవరీ బారి...మారుతీరావుతో లింకు ఇలా...

నల్గొండ జిల్లాలో పరువు హత్యలు: నాడు నరేష్, నేడు ప్రణయ్

ప్రణయ్ హత్య: మాజీ ఉగ్రవాదితో అమృత తండ్రి ఒప్పందం

ప్రణయ్ విగ్రహం.. కోర్టు ఏమందంటే..

ప్రణయ్ హత్య: మారుతీరావు ఇంట్లో పోలీసుల సోదాలు

 

PREV
click me!

Recommended Stories

Singer Mangli in Multiple Controversies: మంగ్లీ చుట్టూ ఇన్ని వివాదాలా? | Asianet News Telugu
డబ్బులుంటేనే ఎవరైనా.. రేవంత్ రెడ్డి సంచలన ప్రెస్ మీట్ | Asianet News Telugu