ఆరునెలల కూతురుతో సహా తల్లి ఆత్మహత్యాయత్నం...

Published : Dec 23, 2018, 03:55 PM IST
ఆరునెలల కూతురుతో సహా తల్లి  ఆత్మహత్యాయత్నం...

సారాంశం

కరీంనగర్ జిల్లాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. పాపం...ఏం కష్టం వచ్చిందో ఏమో గానీ ఓ బాలింత తన ఆరునెలల పసిగుడ్డుతో కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో పసిపాప మృతిచెందగా, తీవ్ర గాయాలపాలైన తల్లి కొనఊపిరితో ఆస్పత్రిలో చికిత్స పొందుతొంది. 

ఈ విషాద సంఘటన కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలం గోపాలపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. ఓ బాలింత ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆరునెలల కూతురుతో పాటు తనపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. అయితే దీన్ని గమనించిన చుట్టుపక్కల ఇళ్లవారు వీరిని కాపాడే ప్రయత్నం చేశారు. అప్పటికే మంటల  ఉదృతికి తట్టుకోలేక చిన్నారి మృతిచెందింది. తీవ్ర గాయాలతో తల్లిని కాపాడగలిగారు. 

ఆమెను దగ్గర్లోని కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దాదాపు శరీరం మొత్తం కాలిపోయిన ఆమె పరిస్థితి కూడా విషయంగా ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు.  

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 
 
PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో చలివానలు... ఏపీలో ఎనిమిది, తెలంగాణలో 23 జిల్లాలకు అలర్ట్
JD Lakshmi Narayana : సీబీఐ మాజీ బాస్ ఇంటికే కన్నం.. రూ. 2.58 కోట్ల భారీ మోసం ! ఎలా బోల్తా కొట్టించారంటే?