
తెలంగాణ హైకోర్టు చరిత్రలో కొత్త అధ్యాయం చోటు చేసుకుంది. మొదటిసారిగా ఓ తీర్పును తెలుగులో వెలువరించింది. సికింద్రాబాదులో ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఆస్తి వివాదంలో తొలిసారిగా తెలుగులో తీర్పు చెప్పింది. గత ఫిబ్రవరిలో కేరళ హైకోర్టు మలయాళంలో కూడా ఓ తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో తాజాగా మంగళవారం తెలంగాణ హైకోర్టు 44 పేజీల తీర్పు వెలువరించింది. ఇటీవల సుప్రీంకోర్టు తన ముఖ్యమైన తీర్పులను ప్రాంతీయ భాషల్లోకి అనువదించి ఆన్ లైన్ ఉంచింది. అందుకే తెలంగాణ హైకోర్టు కూడా అలాంటి నిర్ణయం తీసుకుంది.
ఎన్డీయేను వీడిన నేతలను శిక్షించాలి - కేంద్ర హోం మంత్రి అమిత్ షా
జస్టిస్ పి.నవీన్ రావు, జస్టిస్ నగేష్ భీమపాకలతో కూడిన హైకోర్టు ధర్మాసనం తన తీర్పును వేర్వేరుగా ఇంగ్లీష్ లో రూపొందించి తెలుగు వెర్షన్ తో జతచేసింది. తెలుగులో ఏవైనా అక్షర దోషాలు కనిపిస్తే వాటిని ఇంగ్లీష్ వెర్షన్ తో పోల్చాలని, ఏదైనా గందరగోళం ఉంటే రెండోదానికి ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేసింది. కక్షిదారుల సౌలభ్యం కోసం తెలుగులోనే తీర్పు వెలువరించినట్లు ధర్మాసనం తెలిపింది. కొన్ని ఆంగ్ల పదాలను రాష్ట్ర ప్రజలు విరివిగా వాడుతున్నందున తెలుగు వెర్షన్ లో వాడారని న్యాయమూర్తులు తెలిపారు.
సికింద్రాబాద్ మాచా బొల్లారంలో కె.చంద్రారెడ్డి, కె.ముత్యంరెడ్డిల మధ్య 4 ఎకరాల భూమి విషయంలో వివాదం జరిగింది. వారి తల్లి పేరు మీద ఆ భూమి ఉన్నప్పటికీ ఆమె బతికి ఉన్నప్పుడు దానిని విభజించలేదు. అయితే ఆమె మరణించిన తరువాత వివాదానికి దారితీసింది. తమ తల్లి రాసిన వీలునామా ద్వారా భూమి మొత్తం తనకు వచ్చిందని చంద్రారెడ్డి చెప్పగా, అలాంటి వీలునామా ఏమీ లేదని, సగం భూమిని తనకే చెందుతుందని ముత్యంరెడ్డి సివిల్ కోర్టులో సవాలు చేశారు.
ఉద్యోగులు జీన్స్, టీ షర్టులు ధరించొద్దు - విద్యాశాఖ కీలక ఆదేశాలు
చంద్రారెడ్డి సమర్పించిన వీలునామా విశ్వసనీయంగా లేదని తేల్చిన సివిల్ కోర్టు ఆయన వాదనను తోసిపుచ్చింది. అయితే చంద్రారెడ్డి హైకోర్టులో అప్పీల్ కు మొగ్గు చూపారు. ట్రయల్ కోర్టు ఉత్తర్వుల్లో ఎలాంటి న్యాయపరమైన లోపాలు లేవని, దాన్ని సమర్థిస్తున్నామని ముత్యంరెడ్డి తరఫు న్యాయవాది తరుణ్ జి.రెడ్డి తెలిపారు.
కాగా... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు తెలుగు వెలువరించిన ఈ తీర్పును స్వాగతించారని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ పేర్కొంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 348 ప్రకారం పార్లమెంటు చట్టం చేసే వరకు తీర్పులను ఆంగ్లంలోనే వెలువరించాలని ఉన్నత న్యాయవ్యవస్థ అధికారులను ఆదేశించినందున హైకోర్టులు ప్రాంతీయ భాషల్లో తీర్పులు ఇవ్వడానికి వీలుగా పార్లమెంటు చట్టం చేయాలని ఆయన అన్నారు.
యజమాని ఇంట్లోకి పోనివ్వకుండా చిరుతను భయపెట్టిన శునకం.. తోక ముడిచి పరుగులు పెట్టిన పులి..వీడియో వైరల్
తమిళనాడు, గుజరాత్, చత్తీస్ గఢ్ రాష్ట్రాలు గతంలో హైకోర్టుల్లో ప్రాంతీయ భాషలను ప్రవేశపెట్టేందుకు రాష్ట్రపతి అనుమతి కోరినప్పటికీ సుప్రీంకోర్టు తిరస్కరించింది. 2014 జూన్ లో తమిళనాడు, కర్ణాటక కూడా ఇలాంటి అప్పీళ్లను సుప్రీంకోర్టుకు పంపాయని జస్టిస్ రావు తెలిపారు. ఈ అంశాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేతుల్లో ఉంచాలని 50 ఏళ్ల క్రితం కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పుడు పార్లమెంటు పునఃసమీక్షించవచ్చని ఆయన అన్నారు. దీనివల్ల ప్రాంతీయ భాషల్లో మరిన్ని తీర్పులు వస్తాయని, న్యాయవ్యవస్థ ప్రజలకు మరింత చేరువవుతుందని పేర్కొన్నారు.