కొబ్బరి ముక్క గొంతులో ఇరుక్కుని.. 3యేళ్ల చిన్నారి మృతి..

Published : Jun 30, 2023, 07:20 AM ISTUpdated : Jun 30, 2023, 11:21 AM IST
కొబ్బరి ముక్క గొంతులో ఇరుక్కుని.. 3యేళ్ల చిన్నారి మృతి..

సారాంశం

ఓ చిన్నారి గొంతులో కొబ్బరిముక్క ఇరుక్కుని మృతి చెందిన విషాద ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. 

హైదరాబాద్ : హైదరాబాద్ రాష్ట్ర రాజధాని కుషాయిగూడాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ చిన్నారి గొంతులో కొబ్బరిముక్క ఇరుక్కోవడంతో ఊపిరి ఆడక మృతి చెందారు. మూడు సంవత్సరాల వయసు గల జస్వంత్ అనే చిన్నారి మృతితో ఆ తల్లిదండ్రుల శోకం మిన్నంటింది. 

కుషాయిగూడాలోని అరెపల్లి శ్రీనివాస్, త్రివేణి దంపతుల ఇద్దరు కుమారుల్లో జస్వంత్ చిన్నవాడు. గురువారం తొలి ఏకాది కావడంతో శ్రీనివాస్ దంపతులు గుడికి వెళ్లి పూజలు చేసి వచ్చారు. గుళ్లో కొట్టిన కొబ్బరికాయ ముక్కను ఇంటికి తెచ్చారు. మధ్యాహ్నం ఆడుకుంటూ వెళ్లిన జశ్వంత్ ఆ కొబ్బరి ముక్కను తీసుకుని తినాలనుకుని.. మింగేశాడు. 

అది జశ్వంత్ గొంతులో ఇరుక్కుపోయి.. శ్వాసకు ఇబ్బంది ఏర్పడింది. దీంతో ఏడుస్తుండడంతో కొబ్బరి ముక్క గొంతులోంచి జారడానికి తల్లి త్రివేణి నీరు తాగించడానికి ప్రయత్నించినా ఫలించలేదు. పరిస్థితి చేజారింది. దీంతో బాబును హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే బాబు చనిపోయాడని వైద్యులు నిర్థారించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

August Holidays : తెలుగు విద్యార్థులు ఎగిరిగంతేసే న్యూస్.. ఆగస్ట్ లో ఏకంగా 12 రోజుల సెలవులే..! ఏరోజు, ఎందుకు?
Komuravelli Railway Station: కొమురవెల్లి మల్లన్న భక్తులకు గుడ్ న్యూస్.. రూ.10తో రైలు ప్రయాణం.. పూర్తి వివరాలు ఇవే