హైదరాబాద్ లో అమ్మోనియా గ్యాస్ లీక్, 10మందికి అస్వస్థత...

Published : Jun 30, 2023, 08:16 AM ISTUpdated : Jun 30, 2023, 10:18 AM IST
హైదరాబాద్ లో అమ్మోనియా గ్యాస్ లీక్, 10మందికి అస్వస్థత...

సారాంశం

దొంగతనానికి వచ్చిన ఓ దొంగ అమ్మెనియా గ్యాస్ సిలిండర్ ను కోయడంతో గ్యాస్ లీకై 10మంది అస్వస్థతకు గురయ్యారు. 

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని ఫతేనగర్ లో అమ్మోనియా గ్యాస్ లీక్ కలకలం సృష్టించింది. దొంగలు ఇత్తడి దొంగిలించడానికి గ్యాస్ సిలిండర్ ను రాడ్లతో కొట్టడంతో గ్యాస్ లీక్ అయ్యింది. ఈ ఘటనలో 10మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ గ్యాస్ తో సమీప ప్రాంతంలోని ప్రజలకు కళ్లమంటలు, వాంతులతో ఇబ్బంది పడ్డారు. తీవ్ర అస్వస్థతకు గురైన వారిని బాలానగర్ లోని బీబీఆర్ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. 

చుట్టుపక్కల అన్నీ చిన్న చిన్న ఇండస్ట్రీలే ఉన్నాయి. గ్యాస్ సిలిండర్ల పైనుండే ఇత్తడిని దొంగిలించడానికి ప్రయత్నించారు. అదెవరు అనేది సీసీ టీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. స్థానికంగా ఉండేవారే ఈ దొంగతనానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అమ్మెనియా గ్యాస్ తో ప్రాణహాని ఉండదని, కాకపోతే కాస్త అస్వస్థతకు గురవుతారని వైద్యులు తెలిపారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cold Wave: వ‌చ్చే 4 రోజులు చుక్క‌లే.. గ‌జ‌గ‌జ వ‌ణకాల్సిందే. ఎల్లో అల‌ర్ట్
Vegetables Price : వీకెండ్ మార్కెట్స్ లో ఏ కూరగాయ ధర ఎంత..?