అసెంబ్లీ రద్దుకు గవర్నర్ ఆమోదం.. అపద్ధర్మ ముఖ్యమంత్రిగా కేసీఆర్

By sivanagaprasad KodatiFirst Published 6, Sep 2018, 2:06 PM IST
Highlights

ఉత్కంఠకు తెరపడింది.. తెలంగాణ అసెంబ్లీ రద్దయ్యింది..9 నెలల ముందుగానే శాసనసభను రద్దు చేస్తూ తెలంగాణ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయానికి తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహాన్‌ ఆమోదముద్ర వేశారు. 

ఉత్కంఠకు తెరపడింది.. తెలంగాణ అసెంబ్లీ రద్దయ్యింది..9 నెలల ముందుగానే శాసనసభను రద్దు చేస్తూ తెలంగాణ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయానికి తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహాన్‌ ఆమోదముద్ర వేశారు. అసెంబ్లీ రద్దు అంశంపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది.

ఈ సమావేశంలో అసెంబ్లీ రద్దు తీర్మానాన్ని మంత్రిమండలి ఏకగ్రీవంగా ఆమోదించింది. అనంతరం గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయిన ముఖ్యమంత్రి.. అసెంబ్లీ రద్దు తీర్మానం ప్రతిని అందజేశారు. దీనిని పరిశీలించిన నరసింహన్ గడువుకు ముందుగానే అసెంబ్లీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సమావేశంలో అపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని గవర్నర్.. కేసీఆర్‌ను కోరారు.. దీనికి సీఎం అంగీకరించారు.

అసెంబ్లీ రద్దు: అపద్ధర్మ సీఎంల అధికారాలివే

అసెంబ్లీ రద్దు: గుజరాత్ తీర్పు ఏం చెబుతోంది?

తెలంగాణ అసెంబ్లీ రద్దు: కేబినెట్ తీర్మానం

ముందస్తు: సీఎంగా కేసీఆర్ 1546 రోజుల పాలన

అసెంబ్లీ రద్దు: తర్వాత జరిగేది ఇదే..!

Last Updated 9, Sep 2018, 11:18 AM IST