ఉద్యమకారులకు కేసీఆర్ ఏం చేసిండు.. రాజ్‌భవన్ ముందు యువకుడి ఆత్మహత్యాయత్నం

By sivanagaprasad KodatiFirst Published 6, Sep 2018, 1:49 PM IST
Highlights

కేసీఆర్ గవర్నర్‌ను కలిసేందుకు వస్తుండటంతో రాజ్‌భవన్ పరిసర ప్రాంతాలన్నీ ఉత్కంఠగా ఎదురుచూస్తుండగా.. పోలీసుల, మీడియా సిబ్బంది అలర్ట్‌గా ఉన్న సమయంలో ఆకస్మాత్తుగా ఓ యువకుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.

తెలంగాణ అసెంబ్లీ రద్దు వార్తలతో ఎప్పుడెప్పుడు ఏం జరుగుతుంది.. కేసీఆర్ గవర్నర్‌ను కలిసేందుకు వస్తుండటంతో రాజ్‌భవన్ పరిసర ప్రాంతాలన్నీ ఉత్కంఠగా ఎదురుచూస్తుండగా.. పోలీసుల, మీడియా సిబ్బంది అలర్ట్‌గా ఉన్న సమయంలో ఆకస్మాత్తుగా ఓ యువకుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.

వెంటనే అప్రమత్తమైన పోలీసులు, భద్రతా సిబ్బంది అతన్ని అడ్డుకున్నారు. అతని పేరు ఈశ్వర్‌గా తెలిపాడు.. తెలంగాణ ఉద్యమకారులకు, విద్యార్థులకు చేసిందేమి లేదని.. హామీలు నెరవేర్చుకుండా ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళుతున్నాడని అతను ప్రశ్నించాడు. 

Last Updated 9, Sep 2018, 2:10 PM IST