అమ్మాయిల ఫోటోలు మార్ఫింగ్, పోర్న్ వెబ్ సైట్లలో అప్ లోడ్ చేస్తున్న నిందితుడు అరెస్ట్

By Nagaraju penumalaFirst Published Jul 3, 2019, 7:57 PM IST
Highlights

అశ్లీల వెబ్ సైట్ల నుంచి తొలగించాలంటే డబ్బులు ఇవ్వాలంటూ డిమాండ్ చేసేశాడు. అలా 300 మంది యువతులు ఈ నిందితుడు బారిన పడ్డారు. అయితే ఓ యువతిని ఇలాగే బెదిరించాడు వినోద్. ఆ యువతి సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన సైబర్ క్రైం పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడిని అరెస్ట్ చేశారు. 


హైదరాబాద్‌: సోషల్ మీడియా అతనికి అడ్డగా మారింది. సోషల్ మీడియాలో యువతుల ఫోటోలను సేకరించి వాటిని మార్ఫింగ్ చేసి పోర్న్ వెబ్ సైట్లలో అప్ లోడ్ చేయడం అలవాటుగా చేసుకున్నాడు. పోర్న్ వెబ్ సైట్లో ఉన్న ఆ ఫోటోలను ఆ యువతలకు పంపించి వేధించేవాడు.

పోర్న్ సైట్లలో ఉన్న తన ఫోటోలను తొలగించాలని అడిగిన యువతుల నుంచి భారీగా డబ్బులు గుంజేవాడు. అలా సుమారు 300 మందిని ఈ ఉచ్చులోకి దించి చివరకు అడ్డంగా బుక్కై కటకటాలపాలయ్యాడు. 

వివరాల్లోకి వెళ్తే విశాఖకు చెందిన వినోద్ అనే వ్యక్తి సోషల్ మీడియా ద్వారా అమ్మాయిల ఫోటోలను సేకరించేవాడు. ఆ ఫోటోలను మార్ఫింగ్ చేసి అనంతరం పోర్న్ వెబ్ సైట్లలో వాటిని అప్ లోడ్ చేసేవాడు. 

అశ్లీల వెబ్ సైట్ల నుంచి తొలగించాలంటే డబ్బులు ఇవ్వాలంటూ డిమాండ్ చేసేశాడు. అలా 300 మంది యువతులు ఈ నిందితుడు బారిన పడ్డారు. అయితే ఓ యువతిని ఇలాగే బెదిరించాడు వినోద్. ఆ యువతి సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

కేసు నమోదు చేసిన సైబర్ క్రైం పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడు బారినపడిన వివరాలను సైతం పోలీసులు సేకరించారు. సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత సమాచారం ఉంచొద్దని సైబర్ క్రైం అదనపు డీసీపీ రఘువీర్ స్పష్టం చేశారు. పరిచయం లేని వ్యక్తులతో స్నేహం, సమాచార మార్పిడి చేయోద్దని హితవు పలికారు. ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాలని కోరారు. 

click me!