గాంధీ ఆసుపత్రి గ్యాంగ్ రేప్‌లో కీలక సాక్ష్యం లభ్యం: సీసీటీవీల్లో మహిళ గుర్తింపు,కానీ....

By narsimha lodeFirst Published Aug 19, 2021, 9:32 AM IST
Highlights


గాంధీ ఆసుపత్రిలో అక్కా చెల్లెళ్లపై గ్యాంగ్ రేప్ ఘటనలో కీలక సాక్ష్యం పోలీసులకు లభించింది. ఈ నెల 12వ తేదీన సామూహిక అత్యాచారానికి గురైన మహిళ ఆసుపత్రి ఆవరణలోనే తిరిగినట్టుగా పోలీసులు సీసీటీవీ పుటేజీలో గుర్తించారు. ఆమె ఒంటిపై సరిగా దుస్తులు కూడ లేవని పోలీసులు గుర్తించారు. కానీ ఆమె ఆచూకీ ఇంతవరకు లభ్యం కాలేదు. 

హైదరాబాద్: గాంధీ ఆసుపత్రిలో అక్కా చెల్లెళ్లపై  గ్యాంగ్ రేప్ ఘటనకు సంబంధించి  ఆచూకీలేకుండా పోయిన మహిళ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నెల 12 మహిళ గాంధీ ఆసుపత్రిలో తిరిగినట్టుగా సీసీటీవీ పుటేజీలో పోలీసులు గుర్తించారు.

also read:గాంధీ ఆసుపత్రిలో గ్యాంగ్‌రేప్ కేసులో మరో ట్విస్ట్: మత్తుమందు ఆనవాళ్లు లేవని తేల్చిన మెడికల్ రిపోర్టు

ఐదు రోజులుగా గ్యాంగ్ రేప్ బాధితురాలు ఆచూకీ కన్పించకుండా పోయింది.ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు. బుధవారం నాడు గాంధీ ఆసుపత్రిలోని  350 గదులను కూడ పోలీసులు గాలించినా కూడ ఫలితం లేకుండాపోయింది.

ఈ నెల 12వ తేదీన ఒంటిపై సరిగా దుస్తులు లేని స్థితిలో మహిళ గాంధీ ఆసుపత్రిలో తిరిగినట్టుగా పోలీసులు సీసీటీవీ పుటేజీలో గుర్తించారు. ఈ దృశ్యాల్లో  బాధితురాలు నీరసంగా ఉందని గుర్తించారు. బాధిత మహిళపై కల్లు ప్రభావం ఉండి ఉండొచ్చని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.

తనతో పాటు తన అక్కపై గ్యాంగ్ రేప్ జరిగిందని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఓ మహిళ చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ శరీరం నుండి సేకరించిన రక్త నమూనాల నుండి మత్తుమందు ఆనవాళ్లు లేవని మెడికల్ రిపోర్ట్ తెలిపింది.

ఆచూకీ లేకుండా పోయిన మహిళ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గాంధీ ఆసుపత్రిలోని సీసీటీవీ పుటేజీని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ నెల 12వ తేదీన మహిళ ఒంటిపై సరిగా దుస్తులు కూడా లేని స్థితిలో ఆసుపత్రిలోనే మహిళ తిరిగినట్టుగా పోలీసులు గుర్తించారు.ఆసుపత్రికి సమీపంలోని నిర్మానుష్య ప్రాంతాల్లో కూడా పోలీసులు గాలిస్తున్నారు.

గాంధీ ఆసుపత్రిలోని రేడియాలజీ విభాగంలో పనిచేస్తున్న ఉమామహేశ్వర్ సహా మరో ఆరుగురు తనతో పాటు తన సోదరిపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టుగా బాధిత మహిళ చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇప్పటికే ఉమామహేశ్వర్ సహా మరో ముగ్గురు సెక్యూరిటీ గార్డులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు.

click me!