గాంధీ ఆసుపత్రిలో గ్యాంగ్‌రేప్ కేసులో మరో ట్విస్ట్: మత్తుమందు ఆనవాళ్లు లేవని తేల్చిన మెడికల్ రిపోర్టు

By narsimha lodeFirst Published Aug 18, 2021, 2:17 PM IST
Highlights

గాంధీ ఆసుపత్రిలో అత్యాచారానికి గురైన బాధితురాలి రక్త నమూనాల్లో ఎలాంటి మత్తుమందు ఆనవాళ్లు లేవని మెడికల్ రిపోర్టు తేల్చి చెప్పింది. తనతో పాటు తన అక్కపై కూడ గ్యాంగ్ రేప్ జరిగిందని బాధితురాలు ఆరోపించారు.

హైదరాబాద్: గాంధీ ఆసుపత్రిలో  అక్కా చెల్లెళ్లపై గ్యాంగ్ రేప్ ఘటనలో మరో ట్విస్ట్ చోటు చేసుకొంది. బాధితురాలి రక్తనమూనాల్లో మత్తుమందు ఆనవాళ్లు లభించలేదని మెడికల్ రిపోర్టు తేల్చి చెప్పింది.

also read:గాంధీ ఆసుపత్రిలో గ్యాంగ్ రేప్: మూడు రోజులైనా ఆచూకీ లేని మరో మహిళ, అనుమానితుల విచారణ

ఈ నెల 7వ తేదీ నుండి అక్కా చెల్లెళ్ల ఆచూకీ లేకుండాపోయింది. మూడు రోజుల క్రితం చెల్లి మాత్రం అపస్మారకస్థితిలో గాంధీ ఆసుపత్రి ఆవరణలో కన్పించింది. తనతో పాటు తన అక్కపై కూడ ఉమామహేశ్వర్ సహా మరో ఆరుగురు సామూహిక అత్యాచారం చేశారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు ఆదారంగా పోలీసులు విచారణ చేస్తున్నారు.

గ్యాంగ్ రేప్ నకు గురైన మరో మహిళ ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. ఆసుపత్రి నుండి ఆమె బోయిగూడ వైపు వెళ్తున్నట్టుగా సీసీటీవీలో పోలీసులు గుర్తించారు. కానీ ఆమె ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు.

ఉమామహేశ్వర్ సహా అనుమానితుల నుండి  పోలీసులు రక్తనమూనాలను సేకరించారు. బాధితురాలి నుండి కూడ రక్త నమూనాలను సేకరించారు. బాధితురాలి రక్త నమూనాల్లో మత్తు మందు ఆనవాళ్లు లభ్యం కాలేదని మెడికల్ రిపోర్టులో తేలింది. క్లోరోఫాం సహా ఇతర మత్తుమందు ఆనవాళ్లు లేవని ఈ రిపోర్టు స్పష్టం చేసింది.
 

click me!