ఆధారాలతో సహా బైటపెడతా....కేసీఆర్‌కు వంటేరు సవాల్

By Arun Kumar PFirst Published Nov 29, 2018, 5:03 PM IST
Highlights

తెలంగాణ సీఎం కేసీఆర్ పై గజ్వేల్ కాంగ్రెస్ అభ్యర్థి వంటేరు ప్రతాప్ రెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. సరిగ్గా ఇదే తేదీన అంటే నవంబర్ 29 వ తేదీనే తెలంగాణ ఉద్యమం పేరుతో కేసీఆర్ దొంగదీక్షకు ప్రయత్నించారని విమర్శించారు. ఆయనది దొంగ దీక్ష అని నిరూపించడానికి తన వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని వంటేరు సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 

తెలంగాణ సీఎం కేసీఆర్ పై గజ్వేల్ కాంగ్రెస్ అభ్యర్థి వంటేరు ప్రతాప్ రెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. సరిగ్గా ఇదే తేదీన అంటే నవంబర్ 29 వ తేదీనే తెలంగాణ ఉద్యమం పేరుతో కేసీఆర్ దొంగదీక్షకు ప్రయత్నించారని విమర్శించారు. ఆయనది దొంగ దీక్ష అని నిరూపించడానికి తన వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని వంటేరు సంచలన వ్యాఖ్యలు చేశారు. 

తెలంగాణ ఉద్యమంలో భాగంగా కేసీఆర్ చేపట్టిన దీక్ష బూటకమని వంటేరు ఆరోపించారు. ఆయన ఆహారం  తీసుకోకున్నా ప్లూయిడ్స్ ఎక్కించుకుని ఆస్పత్రిలో నిరాహర దీక్ష కొనసాగించారని వంటేరు అన్నారు. తానే ఊరికే ఈ ఆరోపణలు చేయడం లేదని... కేసీఆర్ కు సంబంధించిన రిపోర్టులు తన వద్ద ఉన్నాయన్నారు. కావాలంటే ఈ అంశంపై ఇందిరా పార్కు సమీపంలోని ధర్నా చౌక్ వద్ద బహిరంగ చర్చకు తాను సిద్దంగా ఉన్నట్లు వంటేరు సవాల్ విసిరారు. ఇందుకు కేసీఆర్ సిద్దంగా ఉన్నారా? అని  వంటేరు ప్రశ్నించారు.

తెలంగాణ ప్రజల ఉద్యమం ఫలితంగా ఏర్పడిన తెలంగాణలో కేవలం కేసీఆర్ కుటుంబం  మాత్రమే లాభపడిందన్నారు. నిరుద్యోగులు, రైతుల సమస్యల గురించి కేసీఆర్ అసలు పట్టించుకోలేదని వంటేరు విమర్శించారు.

కేసీఆర్, వంటేరు.. ఇద్దరూ గజ్వేల్ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఇద్దరి మధ్య రాజకీయ  వైరం ముదిరింది. కేసీఆర్ తన అధికారాన్ని అడ్డు పెట్టుకుని తనపై పోలీసుల చేత దాడులు చేయిస్తున్నారని వంటేరు గతంలో ఆరోపించారు.  తాజాగా మరోసారి కేసీఆర్ ను టార్గెట్ గా చేసుకుని వంటేరు తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేశారు.

మరిన్ని వార్తలు

 

వంటేరు ఇంటి వద్ద హైడ్రామా.. అరెస్ట్

ఇంట్లో పోలీసుల సోదాలు.. వంటేరు ప్రతాప్‌రెడ్డి ఆత్మహత్యాయత్నం

వంటేరు ప్రతాప్ రెడ్డి ఇంట్లో పోలీసుల సోదాలు

ఈసీతో వంటేరు సమావేశం...కేసీఆర్ ఫాంహౌస్‌పై సంచలన వ్యాఖ్యలు

కేసీఆర్ పై పోటీ: ఒంటేరు ప్రతాప్ రెడ్డికి సీరియస్, ఆస్పత్రిలో చికిత్స

వంటేరు దీక్షను భగ్నం చేసిన పోలీసులు (వీడియో)

హరీశ్! యాది పెట్టుకో.. నీ రబ్బరు చెప్పులు మళ్లొస్తయ్: వంటేరు


 

click me!